Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రిని కోరిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ నియోజక వర్గంలో ఆర్అండ్బి రోడ్లు మరియు వివిధ అభివృద్ధి పనుల నిధులు మంజూరు చేయాలని శుక్రవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వాటర్స్‌లో రోడ్లు, భవనాలు శాసన సభ వ్యవహారాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి వినతిపత్రం ఇచ్చినట్లు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. గిరిజన నియోజకవర్గంలో ఏజెన్సీ మండలాల్లో వివిధ గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించవలసిన అవసరం ఉందన్నారు. చాలా గ్రామాలకు రోడ్లు లేవని డొంకదారులే రహదారిగా ఉన్నాయని, బీడీ రోడ్లు తారు రోడ్లు సిసి రోడ్లు ఇవ్వా లని కోరారు. ఎమ్మెల్యే వెంట మర్నేని వెంకన్న, ఎండి.ఖాసీం, నాయిని రంజిత్, తేళ్ల శ్రీను, సూదగని మురళి, లక్ష్మణ్ రావు, ఆవుల వెంకన్న, దుర్గేష్ ఉన్నారు.