Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూక్య రవి నాయక్
నవతెలంగాణ-బయ్యారం
సామాన్య ప్రజల పై అదనపు భారం మోపుతూ పెంచిన వంటగ్యా స్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గిం చాలని సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య రవి నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ,బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. తక్ష ణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెంచిన వంట గ్యాస్ ధరను, పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకు ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సేవాలాల్ రైతు సేన మండల అధ్యక్షులు గుగులోత్ నరేష్ నా యక్, చిరంజీవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ ధరలను తగ్గించాలి : ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్
మండలంలోని వెంకట్రాంపురం, బాలాజీపేట, గంధంపల్లి గ్రామాలలో శుక్రవారం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యి మీద, ఖాళీ వంట గ్యాస్ బండతో మహిళలు వంటచేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రూ410 లు ఉన్న గ్యాస్ బండ ధరను కేంద్ర ప్రభుత్వం అధికారానికి వచ్చిన తొమ్మిది సంవత్సరాల కాలంలో అడ్డు అదుపు లేకుండా కేంద్ర ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చిన రీతిలో ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తుందని ప్రగతిశీల మహిళా సంఘం మండల అధ్యక్షురాలు బొల్లం సో మక్క, యాతం భారతమ్మలు ప్రభుత్వాన్ని విమర్శించారు.ఈకార్యక్రమంలో ఈడ బోయిన సుగుణ, సూరబోయిన సోమక్క, ఎర్రమళ్ళ మంగమ్మ, రావుల వెంకట మ్మ, సెగ్గం సమ్మక్క, పోతుల నిరోషా, దిడ్డి అండమ్మ, లక్కం శోభ, ముద్దిచెట్టి లక్ష్మి, భూలక్ష్మి, మంగమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.