Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను అధిగ మించాలని జిల్లా కలెక్టర్ శశాంక వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ,ఉద్యానవన శాఖ ల ఆధ్వర్యంలోఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలపై కలెక్టర్ సమీక్షించారు. ఉద్యాన వన శాఖ అధికారి వివరిస్తూ జిల్లాలో 4250 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అందుకుగాను 4155.44 ఎకరాలకు పరిపాలన మంజూరు ఉత్త ర్వులు పొందగా 3615 ఎకరాలలో పామాయిల్ మొ క్కలు నాటింప చేసినట్లు వివరించారు. ఇంకను 546.70 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయించ వలసి ఉన్నదని అట్టి లక్ష్యాలను మార్చి 15వ తేదీలో గా సాధిస్తామన్నారు. ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలు సాధించుటలో కురవి నరసింహులపేట ముందున్న ట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా నిర్దేశించుకున్న వి ధంగా ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలన్నారు.అలాగే భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ సాగు పై రైతులు ఆసక్తి, రైతులు కోరిన విధంగా మొ క్కలు సరఫరా చేసేందుకు వ్యవసాయ సంబంధిత శాఖలు ప్రణాళిక రూపొందించుకుని, సిద్ధంగా ఉం డాలన్నారు.ఆయిల్ ఫెడ్ సంస్థ ఫ్యాక్టరీని నెలకొల్పేం దుకు తొర్రూరులోని గోపాలపురం వద్ద 80 ఎకరాలు పరిశీలన చేయడం జరిగిందని ప్రభుత్వ అనుమతు లు పొందాల్సి ఉందన్నారు.ఆయిల్ ఫామ్ సాగుకు మొక్కలు, మెటీరియల్ అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.యూరియా సర ఫరా రైతులకు అందుబాటులో ఉండే విధంగా వ్యవ సాయ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ అధి కారి చత్రు నాయక్, జిల్లా ఉద్యాన, సెరికల్చర్ శాఖ అధికారి సూర్యనారాయణ, వ్యవసాయ సహాయ సం చాలకులు లక్ష్మీనారాయణ, వ్యవసాయ అధికారులు తిరుపతి రెడ్డి ఉద్యాన శాఖ అధికారులు విష్ణు తది తరులు పాల్గొన్నారు.
పనులు నాణ్యతతో చేపట్టాలి....
ప్రభుత్వం చేపట్టే పథకాల నిర్మాణ పనులు నా ణ్యత పరంగా ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక మున్సిపల్ అధికారులను ఆదేశించారు.శుక్ర వారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డు సిగల్ కాలనీ ో నిర్మించిన బస్తి దవఖాన ప నులు, అదే కాలనీలోని రైల్వే ట్రాక్ ప్రక్కనే ఉన్న డంపింగ్ యార్డ్‌ను, పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మోడల్ మార్కెట్ పనులను మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి కలె క్టర్ సందర్శించి పర్యవేక్షించారు. ముందుగా సిగల్ కాలనీలో 11 లక్షలతో పునరుద్ధరణ పనులతో నిర్మిం చిన బస్తి దవాఖాన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీ లిస్తూ సింక్, మరుగుదొడ్లు బేసిన్లపై చర్యలు తీసు కోవాలని అధికారులకు సూచన చేశారు. కిటికీలకు అ ల్యూమినియం మెష్డోర్స్ ఏర్పాటు చేయించాల న్నారు. డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేయించాలన్నారు. అనంతరం అదే కాలనీలోని డంపింగ్ యార్డ్‌ను సం దర్శించి పరిశీలించారు. గాంధీనగర్ వద్ద కూడా మ రో డంపింగ్ యార్డ్ ఉన్నదని నిర్వహణ తీరు సక్ర మంగా చేపట్టాలన్నారు.చెత్తను చదును చేసే డోజర్స్ కొనుగోలు చేయాలని, చెత్త విక్రయించుకునే వారికి మెప్మా సిబ్బంది గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. త ద్వారా వారికి కావలసిన వస్తువులను సేకరించుకొని తీసుకెళ్తారని చెత్త తగ్గే అవకాశం ఉంటుందన్నారు. మిగిలిన చెత్తను డోజర్ ద్వారా ఎప్పటికప్పుడు చదును చేయాలన్నారు. అందుకు కావాల్సిన , అవసరమైన వాహనాలను కొనుగోలు చేయాల న్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్, మున్సిపల్ ప్రసన్న రాణి, డిఈ ఉపేందర్, 26వ వార్డు కౌన్సిలర్ డేలాగర్ స్వాతిశంకర్ తదితరులు పాల్గొన్నారు.