Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ వనాకర్ రెడ్డి
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
విద్యార్థులు ఆరోగ్యం పై దృష్టి సారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డిప్యూటీ మెడికల్ ఆఫీ సర్ వనాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం మండలంలోని కొమ్మనపల్లి తండాలోని ప్రాథమిక పాఠశా లలో ప్రధానోపాధ్యాయులు రాయిపల్లి యాకయ్యతో కలిసి విద్యార్థులకు ఆరోగ్యం పై అవగాహ న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని విద్యార్థులు ఉదయమే ఐదు గంటలకు నిద్రలేచి గ్లాస్ వేడినీరు తాగి వాకింగ్ ఎక్సర్సైజులు చేసి శరీరాన్ని కాపాడుకోవాలని, పరిశుభ్రంగా ఉంటూ విద్యార్థులు చదువుకొని భావి భారత పౌరు లుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ విజరు కుమార్, పీఎంవో విజయ్ కృష్ణ, ఏఎన్ఎం శారద, ఆశ వర్కర్ నీలా తదితరులు పాల్గొన్నారు.