Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవస్థాన కమిటీ అధ్యక్షులు : అశోక్, ఉపాధ్యక్షులు మధు
నవతెలంగాణ-ములుగు
ఈనెల 6,7న ములుగు మండలంలోని కొత్తూరు శివారు లో గల దేవునిగుట్ట లక్ష్మి నర్సింహా స్వామి జాతరను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దేవస్థానం కమిటీ అధ్యక్షులు ఇండ్ల అశోక్, ఉపాధ్యక్షులు బండి మధులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 6న స్వామి వారి కళ్యానోత్సవం, 7న పూర్ణహిత హోమ కార్యక్రమాలు, మొక్కులు సమర్పించుట, గుడిచుట్టూ బండ్లు తిరగడం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.