Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాట నిలబెట్టుకోవాలి
- పేదలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
- సీపీఎం మండల కార్యదర్శి రాపర్తి సోమయ్య
నవతెలంగాణ-జఫర్గడ్
అర్హులైన పేదలందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇం డ్లు కేటాయించాలని సిపిఎం మండల కార్యదర్శి రాపర్తి సోమయ్య పేర్కొన్నారు. తమ్మడపల్లి జి గ్రామానికి స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇచ్చిన మా టను నిలబెట్టుకోవాలని శుక్రవారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ నుండి తాసి ల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ ఎదుట ధర్నా నిర్వహించి ఉప తాసిల్దార్ రామారావు వినతి పత్రాన్ని అందజేశారు. మాట్లా డుతూ గతంలో తమ్మడపల్లి గ్రామానికి స్టేషన్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వచ్చిన సందర్భంగా గ్రామానికి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి నట్లు తెలిపారు. సర్పంచ్ ఎలక్షన్లప్పుడు 500 ఇస్తానని హామీ, ఎంపీటీసీ ఎలక్షన్ లప్పుడు 500 ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. నిరుపేదలైన కుటుంబాలను గుర్తించి అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు కూడా పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా కుంటి సాకుతో కాలం ఎల్లదీస్తున్నారని అన్నారు. ఇటీవల కాలంలో తమ్మడపల్లి జి గ్రామానికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి అడగగా, నా దగ్గర ఏమీ లేదు తాసిల్దార్ భూమి కేటాయించకపోవడం వల్ల లేట్ అవుతుందని చెప్పడం జరిగిందని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎవరి వల్ల లేట్ అవుతుం దో అధికారులా ఇంకా..? ఎవరా..? తెలియజేయాలని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించిన పక్షంలో రానున్న రోజుల్లో దఫల వారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.