Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతమైన బంధాల గ్రామపంచాయతీ లోని బొల్లెపల్లి, పూసాపూర్ బంధాల అల్లిగూడెం ఏజెన్సీ ఆదివాసి గూడాలను శుక్రవారం ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క పర్యటించారు. బొల్లెపల్లి గ్రామంలో సమ్మయ్యకుంట మత్తడి పనులను స్థానిక సర్పంచ్ ఊకే మోహన్ రావుతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మత్తడి పనులను నాణ్యతగా సకాలంలో పూ ర్తి చేయాలని, వర్షాకాలం వస్తే రైతులకు ఇబ్బంది ఏర్పడుతుందని, ఐబిడిఈ సదయ్యకు సూచించారు. పోచాపూర్ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలిం చారు. అంతరం మినీ గురుకులం పాఠశాలను సందర్శించి పరిశీలించారు. విద్యా ర్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా కష్టపడి చదివి భవి ష్యత్తులో ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు.ఏజెన్సీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఏజెన్సీలో విధులు నిర్వహించే ఉద్యోగులు సమయ పాలన పాటించి, సక్రమ విధులు నిర్వహించి, ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగాల సర్పంచ్ ఊకే మౌనిక నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ముదరకోళ్ల తిరుపతి, ముత్తయ్య, దుర్గ, ఆజాద్, మధు, మల్లయ్య,హరినాథ్, పవన్, కృష్ణ, సాహెబ్, చలపతి రావు,పొట్టయ్య, రాంబాబు పాల్గొన్నారు.