Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- రసాభాసగా మారిన జెడ్పీ సర్వసభ్య సమావేశం
- పోడియం ముందు బైఠాయించిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పీ చైర్ పర్స న్ జక్కు శ్రీహర్షినిరాకేష్ అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ లో జరిగిన జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ పిఎస్ దివాకర లు హజరైయ్యారు. ముందుగా వ్యవసాయం, ఉద్యానవనం, వైద్యం ఆరోగ్యం, మిషన్ భగీరథ, డీఆర్డీఏ తదితర శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన అభివద్ధి సంక్షేమ పథకాల ప్రగతిని సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో వివరించారు. వ్యవసాయ అధికారి ఎం.విజయభాస్కర్ మాట్లాడుతుండగా జెడ్పీటీసీలు గుడాల అరుణ, లింగమల్ల శారద, ఎంపీపీలు పంతకాని సమ్మయ్య, మలహలరావు రాణిబాయి, తమ మం డలాల్లో రైతులకు నష్టపరిహారం అందడంలేదని , కొను గో లు కేంద్రాలలోని ఇంకా ధాన్యం ఉందని సభ దృష్టికి తీసుకు వచ్చారు.గతంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో చెప్పి న సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించ లేదని ఆరోపించారు.నామమాత్రపు స మావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప జిల్లా ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆరో పించారు. జిల్లా వ్యవసాయ అధికారి పూ ర్తిసమాచారం ఇవ్వకుండా గతంలో ఇచ్చి న సమాచారం తిరిగి ఇస్తున్నారన్నారు. జిల్లాలోని ఫర్టిలైజర్షాపుల యాజమానులత కు మ్మక్కై షా పులను తనిఖీలు చేయడంలేదని ఆరోపించారు. తనిఖీలు చే పట్టక పోవడంతో అధికధరలకు ఎరువులు, మందులు అ మ్ముతున్నారని తెలిపారు. అధికంగా కురిసిన వర్షాలతో 30 శాతంలోపు పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందిం చేవిధంగా సభతీర్మాణం చేసి ప్రభుత్వానికి నివేదించాలన్నా రు. కాటారం,మల్హర్, మహాముత్తారం, మహాదేవపూర్, పలి మెల మండలాల్లో ధరణిపోర్టల్ వచ్చినపుటి నుంచి పట్టా ల ను రైతుల భూములకు పాస్‌బుక్‌లు లేకుండా రైతు బంధు, రైతుబీమా సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించా రు. మొత్తం 29 శాఖలపై చర్చ జరగాల్సి ఉండగా కేవలం ఐదు శాఖలపై చర్చ జరిపి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ శ్రీహర్షిని మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చే యాలని ఈనెల 14నమరోసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధిపై సమీక్షనిర్వహిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతిని ధులు సమన్వయంతో పనిచేయాలని రా ష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన మిషన్‌భగీరథ పథకం ద్వారా జిలా ్లలో చిట్టచివరి ఇంటికి కూడా మంచినీరు అందించాలన్నారు. వేసవికాలం సమీపి స్తున్న తరుణంలో గ్రామాల్లో మంచినీటి ఎద్దడి కలగకుండా అధికారులు ప్రత్యేక ప్రణాళికఏర్పాటు చేయాలన్నారు. ఆర్ డబ్ల్యూఎస్, గ్రిడ్ జిల్లా పంచాయతీ అధికారులు సమన్వ యంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడా లని మిషన్ భగీరథ నీరు రిపేర్ల పేరుతో నాలుగైదు రోజులు గ్రామాల్లో నీరందడం లేదని నీటి సరఫరా నిలిపివేసే విష యాన్ని గ్రామప్రజలకు ముందే సమాచారం అందజేయాలని అధికారులను కోరారు.
పోడియం ముందు బైఠాయించిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు...
జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించాలని కాం గ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు పోడియం నినాదాలు చే స్తూ బైఠాయించారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.9 లక్షల అవినీతి జరిగినా జిల్లా యంత్రాంగం స్పందిం చడం లేదని కాటారం ఎంపీపీ సమ్మయ్య ఆరోపించారు.
ప్రజా సమస్యలు సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం కాకుండా మిగిలిపోతున్నాయని ఎప్పుడూ చర్చించిన ఇదే విషయాలు అధికారులు రిపీట్ చేస్తున్నారని జెడ్పిటిసి సభ్యులు ఆరోపించారు.
దీంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర కల్పించుకొని వైద్యులను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరస న విరమించారు. ఈ సమావేశంలో , జెడ్పి సీఈవో రఘువ రన్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ కల్లెపు శోభ రఘుపతిరావు, చిట్యాల, టేకుమట్ల , రేగొండ, మొగుళ్లపల్లి జెడ్పిటిసిలు గొర్రె సాగర్, పులి తిరుపతిరెడ్డి, సాయిని విజయ ముత్యం, జోరుక సదయ్య, మహాదేవపూర్, ముత్తారం జెడ్పిటిసిలు గుడాల అరుణ లింగం మల్ల శారద దుర్గయ్య, టేకుమట్ల, మలహర్, కాటారం, మహాదేవపూర్ ఎంపీపీలు రెడ్డి మల్లారెడ్డి, మలహల్రావు, పంతకాని సమ్మయ్య, రాణిబాయి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం విజయభాస్కర్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పురుషోత్తం, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, డీపీఓ ఆశాలత, ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.