Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంట నే తగ్గించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ధరలను నిరసిస్తూ ఏసిరెడ్డినగర్ ఇం దిరాగాంధీ విగ్రహం వద్ద కట్టెల పొయ్యి పెట్టి గ్యాస్ బండకు పూలమాలవేసి వినూత్నంగా ధర్నా నిర్వ హించారు. ఈ ధర్నాకు కూరేళ్ల రాధ అధ్యక్షత వహిం చగా ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగింటి రత్న మాల మాట్లాడుతూ వంటగ్యాస్ ధరలు బిజెపి ప్రభు త్వం విపరీతంగా పెంచడం సరైంది కాదని ఒకవైపు పేదరికంతో నిరుద్యోగంతో పేదలు,అట్టడుగు వర్గాల ప్రజలు సతమతం అవుతుంటే ధరలు పెంచి ప్రజల పై భారాలు మోపడం సరైందికాదన్నారు. బీజేపీ ప్ర భుత్వం అధికారం చేపట్టేటప్పుడు రూ.550లు ఉన్న గ్యాస్‌ని ఏకంగా రూ.1250లకు పెంచడం కా ర్పొరే ట్లకు లాభాలు చేకూర్చడమేనన్నారు. ఒకవైపు ఆదాని అంబానీలు కోట్ల రూపాయలు దండుకొని బ్యాంకుల ను దోచుకుంటూ ప్రజల కష్టార్జితాన్ని బోంచేస్తుంటే పేదలపై భారాలు మోపడం బి జే పీ ప్రభుత్వానికి చెల్లుతుందన్నారు. వెంటనే ధరలు తగ్గించి సబ్సిడీతో కూడిన గ్యాస్ అందించాలని పేదలకు రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవ సర సరుకులు దించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఐద్వా కమిటీ సభ్యులు టి భవాని, ప్రత్యూష, జ్యోతి, వాణి, దివ్య, జ్యోతి, జమున తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రత్నమాల
నల్లబెల్లి : కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం పెం చిన వంటగ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని ఎంసీపీ ఐ(యు) మండల కార్యదర్శి దామ సాంబయ్య , మ హిళా సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అంగడి పుష్ప లు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శనివారంఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో గ్యాస్ ధరలను తగ్గించాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య, పుష్పలు మాట్లాడుతూ వంటగ్యాస్ధర రోజురోజుకు పెంచుతూ రూ.1176 లకు పైగా పెంచడం ద్వారా మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారంపడుతుందని ఆవేదనవ్యక్తం చేశా రు. కేంద్ర ప్రభుత్వం మహిళలను మళ్లీ కట్టెల పొయ్యి పైవంటచేసి కన్నీరు తెప్పించేలా చేస్తుందని తెలిపా రు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించు కుంటే ప్రజల భాగస్వామ్యంతో రోజురోజుకు పెద్ద ఎ త్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ డివిజన్ కార్యదర్శి మార్తా నాగరాజు, జయలక్ష్మి లక్ష్మి, లలిత, శివాని, రాణి, పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రూ. 50లు పెంచినందుకు నిరసనగా, భారత కమ్యూని స్టు పార్టీ ఎలుకతుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో, బస్టాండ్ కూడలిలో రాస్తారోకో చేయడం జరిగింది .పెంచిన ధర తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్య తిరేక విధానాలు నశించాలని, చమురు ధరలు తగ్గిం చాలని డిమాండ్ చేస్తున్నామని మండల కార్యదర్శి రాములు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల వి శ్వాసంకలిగే విధంగా వ్యవహరించకపోతే, భవిష్యత్తు లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లాకార్యవర్గ సభ్యులు కర్రే ల క్ష్మణ్, మండల కార్యవర్గ సభ్యులు తండ మొండయ్య, నిమ్మల మనోహర్, మర్రిపల్లి తిరుమల, గడ్డం లలిత ,పంబాలస్వామి, పట్నం మర్రివిజరు, ఇంజాల పోశ య్య, మంత్రుతి మల్లయ్య, సూర మొగిలి,కుమార్ స్వామి, మోహన్‌రెడ్డి,అనిల్ కుమార్‌లు పాల్గొన్నారు.