Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న ఆధ్వ ర్యంలో వేలేరు మండలం కన్నారంలో పొద్దుతిరుగుడు పంటలో క్షేత్ర దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సౌమ్య సేద్య విభా గంవారు పొద్దు తిరుగుడు పంటలలో అధిక దిగుబడులు సాధించ డానికి పాటిం చవలసిన మెళకువలను వివరించారు. అలాగే పూత సమయంలో, తల వేసే స మయంలో తల పరిమాణం ఎక్కువగా పెరగడానికి రెండు గ్రాముల బోరాన్ లీట ర్నీటికి కలిపి పిచికారి చేయవలసిందిగా సూచించారు. పంట మార్పిడి చేయా లని సూచించారు. సస్యరక్షణ విభాగం డాక్టర్ రాజు మాట్లాడుతూ రైతులు ఇమీ డక్లోప్రిడ్ అనే రసాయన మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలని దీని ద్వారా తొలి దశలో రసం పీల్చే పురుగులను, తల వేసే సమయంలో నోవలురాన్ను పిచికారీ చేస్తే శనగ పచ్చ పురుగును నివారించ వచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సంఘం సభ్యులు శ్రీను, రైతు కోఆర్డినేటర్ కొమురయ్య పాల్గొన్నారు.