Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
నిత్యం ప్రజలకు సేవ చేస్తూన్న ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడలు మాన సిక ఉల్లాసంతోపాటు ఉత్సాహాన్ని క లుగజేస్తాయని టీఎన్జీవో వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జేల రామకిషన్ అ న్నారు. అంతర్జాతీయ మహిళా దినో త్సవాన్ని పురస్కరిం చుకొని టీఎన్జీ వోస్ యూనియన్ వరంగల్ జిల్లా ఆ ధ్వర్యంలో శనివారం వరంగల్ నగరంలోని ఓసిటీ ఇండోర్ స్టేడియంలో మహిళ క్రీడోత్సవాలను ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది ¸గా టీఎన్జీవోస్ నాయకులతో కలిసి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఉద్యో గులు పని ఒత్తిడిలో ఉంటారని మహిళా ఉద్యోగులకు క్రీడలు ఉల్లాసంతో పాటు ఉ త్సాహాన్ని మానసిక ప్రశాంతతను కలుగచేస్తాయని అన్నారు. మహిళా దినోత్సవాన్ని టిఎన్జీవోస్ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మహి ళా ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొని విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా క్రీడల యువజన సంక్షేమ అధికారి ఇందిరా విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు ఉద్యో గులు పనిబారంతో తమఆరోగ్యాన్ని మరిచి పోతా రని, ఆరోగ్యం కోసం యోగా, క్రీడలు ఎంతో దోహద పడతాయని ఉద్యోగులు విధిగా యోగాతో పాటు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి గాజ వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానంద, ఉపాధ్యక్షులు గద్దల రాజు, జిల్లా సహాయ కార్యదర్శి రమాదేవి రజిత జ్యోతి గణేష్ ఐసిడిఎస్పురం అధ్యక్షురాలు రాజేశ్వరి, వెటర్నరీ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, అంగన్వాడి టీచర్ నాయకురాలు భవాని శ్రీలక్ష్మి సునీత రమాదేవి రజిత ఉద్యోగ సంఘ నాయకురాలు కష్ణవేణి రజిత అమరావతి శ్రీ లక్ష్మీ స్వరూప శైలజ తదితరులు పాల్గొన్నారు.