Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
మండల పరిధిలోని కో నాపురం గ్రామంలో గుట్టపై వెలసిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని సర్పంచ్ వెల్ది సుజాత సారం గం, ఎంపిటిసి మహేందర్ , ఉపసర్పంచ్ నరసింహ రా ములు ఆధ్వర్యంలో అంగరం గ వైభవంగా అష్టోత్తర శతఘటాభిషేకం తో శనివారం బ్రహ్మౌత్సవాలను ఘ నంగా ముగించారు. అర్చకులు ప్రధానఆలయంలో 108 కలశాలను వరుసగా పే ర్చి వేదపండితుల మంత్రోచ్ఛారణలు పారాయణీకుల పారాయణాలు యజ్ఞీకులు రుత్వికులమూలమంత్ర మూర్తిమంత్ర హౌమాలు జపాల మధ్య మంగళ వాయి ద్యాల హౌరు నడుమ కలశాలకు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం 108 కలశాల్లో ఉన్న మంత్రజలంతో స్వామివారికి ప్రధానఅర్చకులు కశివొజ్జుల శివకష్ణా చార్యులు, రణదీర్శర్మ, సాయిశర్మ, కౌశిక్శర్మలు అభిషేకం నిర్వహించారు. ఈ వేడుకలో వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ, కుల పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.