Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
క్యాన్సర్‌పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు. శనివారం పట్టణంలోని ఐఎంఏ హాల్లో కస్తూరిబాయి మ హిళ మండలి, ఐఎంఏ మహిళా అసోసియేషన్ అధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీ నింగ్ క్యాంప్‌ను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా స్వప్న మాట్డాడుతూ మహిళలు ఆరోగ్యరక్షణ పట్ల నిర్లక్ష్యం చేయరాదన్నారు. స్త్రీ జన్మ ఎంతో గర్వించదగినదనీ బ్యా లం నుంచి స్త్రీగా అనేక రకాలైనా కష్టాలను ఎదుర్కొంటూ విజయాలను సాధించే క్రమంలో ఒత్తిడిలకుగురై ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మహిలల్లో క్యా న్సర్ చిన్న వైరస్‌గా మారి 10 ఏళ్ల తర్వాత తీవ్రరూపం దాల్చుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకొంటూ తగు జాగ్రత్తలు పాటించినట్లయితే కాన్సర్‌ను నుంచి బయటపడొచ్చని సూచించారు.ఐఎంఏ మ హిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ పీ.భారతి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయరాదన్నారు. తేలికపాటి లక్షణాలు కన్పించగానే వైద్యులను సం ప్రదించాలని సూచించారు. ముందుజాగ్రత్తలు తీసుకున్నట్లయితే క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదన్నారు. ఈవైద్య శిబిరంలో 100 మందికి స్క్రీనింగ్ చేసి తగే విధం గా మందులను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా క్టర్ చామర్తి నందకిషోర్, డాక్టర్ ఉజ్వల, డాక్టర్ సుజాతారాణి, డాక్టర్ నవత, డాక్ట ర్ హిమబిందు, డాక్టర్ సింధూ, డాక్టర్ వనజ, డాక్టర్ వాసవి, డాక్టర్ భావన, డాక్ట ర్ సౌమ్య, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఎంపీపీ మోతె కలమ్మ, కౌన్సి లర్లు రాయిడి కీర్తి, దార్ల రమాదేవి, బానాల ఇందిర, గందె రజిత, వేల్పుగొండ పద్మ, రామసహాయం శ్రీదేవి, కోఆప్షన్ సభ్యులు నాయిని సునిత, పరికి జ్యోతి, కస్తూరిబాయి మహిళా మండలి నాయకురాలు గుర్రపు అరుణ, పెండెం రాజేశ్వరీ, నల్లా భారతి, వాసం కరుణ, చిలువేరు రజిని భారతి, వేముపల్లి ఉమాదేవి, గొర్రె రాధ, తక్కలపెల్లి ఉమాదేవి, గన్నోజు జయప్రద, కొయ్యడి సరళ, అన్నపూర్ణ, ఉగ్గిడి శ్యామల, భక్తిని శిరీష, నాంపెల్లి విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.