Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులకల్పనే ధ్యే యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా 'మన ఊరు మనబడి, మనబస్తీ-మనబడి' కార్యక్ర మానికి పెద్దపీట వేస్తూ నిధు లు కేటాయిస్తుందని 24వ డి విజన్ కార్పొరేటర్ ఆకుతోట తేజస్వి శిరీష్ అన్నారు. శనివారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తేజస్వి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మరిన్ని నిధు లు తీసుకువస్తానన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు పూసారం, సులోచన, ఎస్ఎంసీ చైర్మన్ రమేష్, కాంట్రాక్టర్ జానీ పాషా, డివిజన్ అధ్యక్షులు పందికొండ శివరాజ్, మైనార్టీ అధ్యక్షుడు ఎండి.సద్దాం, చాగంటి కిరణ్‌లు పాల్గొన్నారు.