Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐబీ, రెవెన్యూ, ఎన్‌హెచ్ అధికారులతో ఎన్ఓసీ తీసుకోండి
- కార్పోరేషన్ అధికారులకు కమిషనర్ ప్రావీణ్య ఆదేశాలు
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్ 66వ డివిజన్ కేంద్రం ఉమ్మడి స్మశాన వాటికను హసన్‌పర్తి పెద్ద చెరువు కట్ట సమీపంలో మోడల్ ఉమ్మడి స్మశాన వాటిక నిర్మాణ పనులకు అ న్ని అనుమతులు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ ము న్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ ప్రావిణ్య కార్పోరేషన్ అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్ గురు మూర్తి శివకుమార్‌తో పాటు కార్పోరేషన్ అధికారుల తో కలిసి కమిషనర్ ప్రావీణ్య శనివారం ఉమ్మడి స్మశా నవాటిక స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ హసన్‌పర్తి పెద్దచెరువు సమీ పం లో ఉమ్మడి స్మశానవాటిక నిర్మాణ పనులను వేగ వంతం చేయాలంటే ముం దుగా ఎన్‌హెచ్, ఐబీ, రెవె న్యూశాఖ అధికారుల నుం చి అన్నిఅనుమతులు తీసు కోవాలని అధికారులను ఆ దేశించారు. ప్రస్తుతం ఈ స్థలం నేషనల్ హైవేతో పా టు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నందున వారి నుంచి ఎన్ఓసీ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం చెరువు కట్ట నుంచి 30 మీటర్ల పరిధి బఫర్ జోన్ ఉన్నందును ఇక్కడ ఉమ్మడి స్మశాన వాటిక నిర్మాణానికి ఏవైనా అ భ్యంతరాలు ఉంటే సంబందిత శాఖ అధికారుల అను మతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈస్థలంఎవరి స్వాధీనంలో ఉందో వారి నుంచి కూ డా అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. సత్వరమే కా ర్పోరేషన్ నుంచి సంబందిత శాఖల అధికారుల అను మతులను కోరుతూ ఫైల్ పంపించాలని ఇంజనీ రింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సం దర్భంగా కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉమ్మడి స్మశాన వాటిక స్థలం నిర్మాణం కోసం వివిధకులాలకు చెందిన కుల పెద్ద లు తమ స్థలాలను స్వచ్చందంగా ఇచ్చేందుకు సిద్దం గా ఉన్నారని తెలిపారు.
ప్రస్తుతం ఈ స్థలం పెద్ద చెరువు కట్ట బఫర్ జో న్లో ఉన్నందున ఐబీఅధికారుల నుంచిఎన్ఓసీ కో సం మేము ప్రయత్నం చేస్తామని తెలిపారు. అంతేకా కుండా ప్రస్తుత చెరువుకట్ట సమీపంలోని ఖాళీ స్థలం లో కుడా రోడ్డు మినహాయించి స్మశాన వాటిక నిర్మా ణం చేపడితే అన్ని కులాలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దీనికి సానుకూలంగా స్పం దించి కమిషనర్ ఉమ్మడి స్మశానవాటిక నిర్మాణ పను ల వేగవంతానికి తక్షణ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంట ఇఇ రాజ య్య, డీఈ రవికుమార్, ఏఈ దొడ్డపాటి హరికు మార్, వర్క్ఇన్స్పెక్టర్ తోట సురెందర్, రాజు, సీఎం హెచ్ఓ రాజేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ భాషనాయక్, భీమయ్య, జవాన్ల్ సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.