Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో శనివారం కెవిపిఎస్ డైరీని ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పోడేటి దయాకర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా స్థానిక ఎస్సై డి.దేవేందర్, పిఎసిఎస్ చై ర్మన్ మనోజ్ కుమార్, అన్నారం షరీఫ్ సర్పంచ్ యశోదబాబుల చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ డైరీలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబు జగ్జీవన్ రామ్ వంటి మహానీయుల ముఖ్యమైన జీవితవిశేషాలు, ఎస్సీ,ఎస్టీల హక్కులు, సమాచార హక్కుచట్టం, ఎస్సీఎస్టీ రాష్ట్ర, జాతీయ కమిషన్ పూర్తి వివరాలు, రా ష్ట్రం, దేశం సమాచారం, ఎస్సీ,ఎస్టీల కేసుల వివరాలు చట్టాలు, రాజ్యాంగం క ల్పించిన హక్కులు, వీటన్నింటినీ క్రోడీకరించి వారి హక్కుల్ని తెలియజేసే విధంగా ఈ డైరీని ముద్రించడం కెవిపిఎస్ సామాజిక దక్పథానికి నిదర్శనమన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ డైరీ ద్వారా చట్టాల గురించి అవగాహన కలిగి కెవిపిఎస్ చేసే పోరాటాల్లో భాగస్వాములై, కుల, మత అంతరాలు లేని సమసమాజ స్థాపనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల నాయకు లు ఆబర్ల రాజుకుమార్, జడల కృష్ణ, ఎస్కే మైబెల్లి, భాషామియా, గ్రామ పెద్దలు , సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.