Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఓడబ్ల్యు పిలుపు
నవతెలంగాణ-మహబూబాబాద్
దేశంలో పురుషాధిపత్యాన్ని స్థిరీకరిస్తున్న మను వాదానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని ప్రగశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన బోయిన అనసూయక్క పిలుపు నిచ్చారు. శనివారం ప్రగతిశీల మహిళా సంఘం పిఓ డబ్ల్యూ మహబూబాబాద్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వారోత్స వంలో భాగంగా స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి మదర్ తెరిసా సెంటర్ మీదుగా అండర్ బ్రిడ్జి నుండి ప్రభుత్వ ఆస్పటల్ నెహ్రూ సెంటర్ ఇంద్ర గాంధీ సెంటర్ మీదుగా కోర్టు సెంటర్ వరకు ప్రగతి శీల మహిళా సంఘం పిఓడబ్ల్యు ఆధ్వర్యంలో డప్పు డాన్స్ కోలాటం నృత్యాలుతో భారీ ర్యాలీ నిర్వహించ డం జరిగింది. అనంతరం జరిగిన సభకు పిఓడబ్ల్యూ పట్టణ కార్యదర్శి ఎండి కవిత అధ్యక్ష వహించగా ముఖ్యఅతిథిగా అనసూయక పాల్గొని ప్రసంగిస్తూ బి జెపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి మనువాదం పేరుతో పురుషాధిపత్యాన్ని పెంచి పో షించడం కోసం భావవాదంతో పురుషాధిపతి అని స్థిరీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులు హత్యలు అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తి గా విపలమైనాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో విద్యాలయాల్లో ర్యాగింగ్ పేరుతోటి వికృత చేష్టలు నిర్వహిస్తున్న పాలకులు పట్టించు కోవడం లేదని, వీటన్నిటికీ కారణం మద్యం మత్తు పదార్థాల అరికట్టకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనేఉన్నాయి.ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తెచ్చామని చెప్పుకుంటున్న వా టిని అమలులో పారదర్శకత లేదని పేదవాడికో న్యా యం ఉన్నోడికో న్యాయం లేక లాగా ఉన్నాయని ఆవే దన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను అమలు చేయాల ని దేశంలో రాష్ట్రంలో మత్తు పదార్థాలను, మద్యం, అశ్లీల సినిమాలను, అశ్లీల సాహిత్యాలను సీరియల్ అరికట్టాలని డిమాండ్ చేశారు. వీటికి వ్యతిరేకంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే బాబన్న, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ మెహబూబా, డివిజన్ కార్యదర్శి హెచ్ లింగన్న, నాయకురాలు మంద పద్మక్క, సామ రజిత, ఎస్.కవిత, ప్రసంగిం చారు.ఈ కార్యక్రమంలో కుక్కమూడి అనిత, జయ మ్మ, పట్టాభిరామ, జయలచ్చమ్మ, దుర్గ, కోమల, శ్రీల త, ఉమా,భూక్యపద్మ, సునీత, సుజాత, పాల్గొన్నారు.
పిఓడబ్ల్యు పోస్టర్ అవిష్కరణ
కేసముద్రం రూరల్ : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరు తూ కేసముద్రం మార్కెట్ యార్డులో జిల్లా నాయకు రాలు శివారపు శారద అధ్యక్షతన ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ వాల్ పోస్టర్లను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు జక్కుల కొమురక్క మాట్లాడుతూ మహిళాభివృద్ధి దెబ్బతీసే స్త్రీ,పురుష అసమానతలు పెంచి పోషించే బ్రాహ్మనీయ పితృస్వామిక పాలకులకు వ్యతిరేకంగా మహిళలలు పోరాడాలన్నారు. సమాజంలో మహిళల పట్ల నేటికీ వివక్షత కొనసాగటం సిగ్గుచేటని, పురుషా ధిక్య సమాజంలో మహిళల పై అగయిత్యాలు, అత్యా చారాలు పెరిగిపోయాయని స్త్రీ పురుష సమానత్వం పై మహిళలు సంఘటితంగా పోరాడాలని అన్నారు. పిఓడబ్ల్యు జిల్లా నాయకురాలు శివారపు శారద మా ట్లాడుతూ మెడికల్ విద్యార్థిని ప్రీతిని వేధింపులుకు గురి చేయడం వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని కాలే జీ యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకుని ఉంటే మెడికల్ విద్యార్థిని ప్రీతి సజీవంగా ఉండేదని ప్రీతి మృతి పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల ని, సైప్ పై అత్యా నేరం కింద అరెస్టు చేయాలని డి మాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తురక రాధ, ఆం గోతు తార, కళ్లెం సుగుణమ్మ, లక్ష్మి, సారమ్మ, రామ తార, కాసు శాంత, సంద పద్మ, భూక్య నీలమ్మ, మీ లక్ష్మి, తార,తదితరులు పాల్గొన్నారు.