Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పీవీపీ లలితా శివజ్యోతి
నవతెలంగాణ-ములుగు
సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ మన ప్రగతికి మూలం అని గుర్తుంచు కోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పివిపి లలితా శివజ్యోతి తెలిపారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమిషన్ సూచనల మేరకు ములుగు జిల్లా న్యాయ సేవా అధికా ర సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా వెంకటాపూ ర్ మండలం కేశవపూర్ గ్రామంలో శనివారం సర్పంచ్ జయలక్ష్మి అధ్యక్షతన మ హిళా చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిóగా ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సం స్థ చైర్మన్ పీవీపీ లలితా శివజ్యోతి పాల్గొని మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం మార్చి 8 నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామనీ, ఈ 2023 సంవత్సరం మహిళా దినోత్సవం యొక్క థీమ్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నా లజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అని తెలిపారు. నేటి సమాజంలో ఉన్నత స్థానంలో ప్రతీ రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. మహిళల కోసం ఎన్నో రకమైన చట్టా లు ఉన్నాయనీ,ప్రతీ చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలనీ, స్త్రీ మూ ర్తులు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమఆర్థిక అవసరాలను తామేస్వయంగ నిర్మించు కోగలిగే ఉన్నత స్థితికి చేరుకొని స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నారనీ తెలిపారు. ఏ రంగంలోనూ తక్కువ కాదని వారిని వారు ప్రతిక్షణం నిరూపించుకుంటున్నారనీ, విద్య, వైద్య వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాం కింగ్, అంతరిక్షం, టెక్నాలజీ ఇవి కాకుండా చివరగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించే మహిళాగా ఓ గృహిణిగా పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు నిరంతరం వేస్తున్నారన్నారు. మహిళని గౌరవించాలి వారిని తక్కువగా చూడడం కించపరచడం లాంటివి చేయకూడదనీ, వాళ్లు కూడా మగవారిలానే చదువుకుంటున్నారనీ, ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. పురుషులతో పాటుగా స్త్రీలకుకూడా సమానంగా అవకాశాలు,హక్కులు మొదలైన వాటికి కల్పిం చడం జరిగిందన్నారు. స్త్రీలు చదువుకోవడం వల్ల నేడు స్త్రీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా తనంతట తానే నిలబడే శక్తిని సంపాదిస్తుందనీ, స్త్రీ విద్య, స్త్రీ సంపద అనేది పిల్లల, కుటుంబ భవిష్యత్తుకు, సమాజ శ్రేయస్సుకు, దేశ ప్రగతికి ఉపయోగపడుతుంది. అందుకే మహిళలు అక్షరాస్యులు అయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలు మహి ళలకు, వృద్ధులకు, పిల్లలకు న్యాయపరంగా సహాయం చేయడానికి ఎల్ల ప్పుడూ కృషి చేస్తూనే ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ డి రామమోహన్ రెడ్డి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కుమారి జై సౌఖ్య, సబ్ రిజిస్టార్ తస్లీమా మహ మ్మద్, జిల్లా పంచాయతీ ఆఫీసర్ వెంకయ్య, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈపి ప్రేమ లత, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు బాలుగు చంద్రయ్య, న్యాయవాదులు సిహెచ్.వేణుగోపాల చారి, మేకల మహేందర్, కన్నోజు సునీల్ కుమార్, సిహెచ్. రాజేందర్, సుమారుగా150మంది గ్రామ మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.