Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యలు ప్రారంభించారు. ఈ సందర్బంగా స్థానిక మహిళా ప్రజా ప్రతినిధులు మంగళ హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ మా అభిమానులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించటం జరిగిందన్నారు. ఇల్లందు నియోజకవర్గ పరిధి లోని మిగిలిన మండలాల్లో సైతం మన కార్యాలయాలు అతి త్వరలో ప్రారం భించనున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతీ కుటుంభానికి ఆర్థిక సహాయ సహ కారాలు అందజేస్తన్నా అండగా నిలుస్తున్న కోరం కనకయ్యకు ప్రతీ ఒక్కరూ అండ గా నిలవాలని పిలుపు నిచ్చారు. అనేక మంది బలిదానాలు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 9 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని, కేసీఆర్ హామీలు మాటలకే పరిమితమయ్యా యన్నారు. గారడి మాటలు చెప్పే ఈ ప్రభుత్వానికి కాలం దగ్గర పడిందిని పేర్కొ న్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, ప్రజాఅభీష్టం మేరకు నా రాజకీయ ప్రస్థానం ఉంటుందని తెలిపారు. ప్రజల హమీలను కేసీఆర్ నేరవేర్చలేదని,కేసిఆర్ ప్రభుత్వం కూలిపోయే సమయం దగ్గర పడిందని అన్నారు. నాలుగు సంవత్సరాల నుండి పదవి వున్న లేకున్న ప్రజలతోనే ఉన్నామన్నారు.ప్రజలే నాకు దేవుళ్ళుని పేర్కొన్నారు. ఈకార్యాక్రమంలో గార్ల మం డల జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతి నిధులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.