Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
పేద మధ్యతరగతి ప్రజలపై పె నుబారం పడుతున్న పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చే స్తూ శనివారం ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరమ్మ కాలనీలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భం గా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చీర రజిత పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలు పెంచి కానుకగా ఇచ్చిందన్న ఎద్దేవా చేశారు. బిజెపి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చే ముందు రూ.450 ఉన్న గ్యాస్ ధర రూ.1150 కి ఈరోజు పెం చిందన్నారు. పేదలపై భారాలు వేస్తూ ఆదానీ అంబానీలకు దోచిపెడుతుందని, సామాన్య ప్రజలు పేదలు వాడే అటువంటి వస్తువులపై జిఎస్టి పేరుతో అధిక భారంమోపి కార్పొరేట్ శక్తులకు సబ్సిడీలు తగ్గించి వాళ్ళ మెప్పు కోసం బిజెపి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వాపట్టణ సీనియర్ నాయకురాలు బూడిద అంజమ్మ,నాయకులు సుంచు ప్రభావతి, భాను ప్రియ, ఫంగ సుజాత, నర్సమ్మ, జిల్లా సువర్ణ, గంగమ్మ, టి లక్ష్మి, ఎర్ర శాంత మ్మ, బూడిద భవాని, లావణ్య తదితరులు పాల్గొన్నారు.