Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపె నీస్ ఆధ్వర్యంలో వద్దిరాజు కిషన్, రా జ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సోదరుల సహకారంతో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ను వారి సోదరుడు వద్దిరాజు దేవేంద్ర శనివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయలలిత మాట్లాడుతూ గాయత్రి గ్రూ ప్ ఆఫ్ కంపెనీస్ యజమానులైన వద్దిరాజు కిషన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోదరులు రూ.2 లక్షలు వెచ్చించి ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించారని తెలిపారు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు పరిశుభ్రమైన నీటిని అందించాలని ఉద్దే శంతో ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించారని వివరించారు. విద్యార్థుల ఆ రోగ్యం కోసం పాటుపడుతున్న గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమానులు వద్దిరాజు కిషన్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, వారి సోదరులకు ఎల్లవేళలా రు ణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దార్ల రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ వెంకయ్య, వజినపల్లి శ్రీధర్, గుజ్జునూరి బాబురావు పాల్గొన్నారు.