Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ శిరిష
నవతెలంగాణ-హసన్పర్తి
మహిళల ఆరోగ్యంతోనే మెరుగైన సమాజం సాధ్యమని డాక్టర్ శిరిష అన్నారు. మండల కేంద్రంలోని యూపీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ అధ్యక్షతన ధీర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలు, అన్యాయాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ శిరిష ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలపై సమాజంలో జరుగుతున్న దాడులు, అకృత్యాలు, అత్యాచారాలు, అన్యాయాలను ఎదిరించి పోరాడాల్సిన అవ సరం ఉందన్నారు. మహిళలు చైతన్యవంతమైనప్పుడే సమాజంలో జరుగుతున్న దాడులను తిప్పికొట్టవచ్చన్నారు. డాక్టర్ వాణిశ్రీ మాట్లాడుతూ సమాజంలో జరు గుతున్న మార్పులకనుగుణంగా మహిళలు మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, హింసలు, హత్యలను మ హిళా సమాజం ఐఖ్యంగా ఎదిరించి దోషులకు శిక్ష పడేలా చేయాలన్నారు. మ హిళలు సమాజంలో ఆత్మగౌరవంగా జీవించాలన్నారు. ప్రతి మహిళ తన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డాక్టర్ మధుచందర్, డాక్టర్ మానస శ్యామల, పీహెచ్ఎన్ స్వర్ణలత, ఫార్మసిస్టు అజిత, డీఈఓ సునిత, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.