Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ - పర్వతగిరి
ప్రపంచ శాంతికి,సౌభాగ్యానికి మూలం యోగా అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్ల వాడ గ్రామం గొట్ల కొండ కొండల మధ్య ఎర్రబెల్లి వారి కుటుంబాల తరపున తరతరాలుగా ఉన్న దాదాపు 180 ఎకరాల భూమిని, కొలను శ్రీ వేంకటేశ్వర స్వామి ట్రస్టు , ఎర్రబెల్లి ట్రస్టు తరపున శ్రీ రామ చంద్ర మిషన్ కు ఆదివారం అప్పగించారు. ఈ మేరకు ఆ భూమికి సంబంధించిన పత్రాలను, మ్యాప్ లను శ్రీ రామచంద్ర మిషన్ కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ యోగా గురువు కమలేశ్ డి పటేల్ దాజీ కి మంత్రి పర్వతగిరిలోని తన స్వగహంలో అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తరతరాలుగా తమకు వారసత్వంగా వస్తున్న భూమిని తమ ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. యోగా ను విశ్వ వ్యాప్తం చేయాలనే సంకల్పంతోనే తాను ఈ మహాత్కార్యానికి పును కున్నట్లు మంత్రి చెప్పారు. దాజీ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ రామచంద్ర మిషన్ ను తెలంగాణలో విస్తరించాలన్న ఆలోచనను మంత్రి ప్రాణ ప్రదం చేశారని అన్నారు. వారి సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ యోగా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి, ఎర్రబెల్లి ట్రస్టుకు దాజీ కృతజ్ఞతలు తెలిపారు.