Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పోలీస్ స్టేషన్ వెనుక ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద 163వ జాతీయ రహదారిపై ఆదివారం పెట్రోల్ బంక్ లీజుకు తీసుకున్న వ్యక్తి రహదారికి నిలువుగా స్పీడ్ బ్రేకర్ల సీసీ నిర్మాణాలు చేశారు. పెట్రోల్ బంకులు పనిచేస్తున్న మేనేజర్‌ను వివరణ కోరగా తమ యజమాని రాజిరెడ్డి నిర్మాణం చేపట్టమంటే చేపడుతున్నామని తెలిపారు. సదరు లీజుకు తీసుకున్న రాజిరెడ్డిని ఫోన్లో వివరణ కోరగా పస్రా పోలీస్ స్టేషన్ సిఐ శంకర్ స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం చేయమని సలహా ఇచ్చినందున తాను నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇతర జాతీయ రహదారి అధికారులు ఎవరైనా అనుమతించారు అంటే అలాంటిది ఏమీ లేదని తెలిపారు. ఈ విషయమై సీఐ శంకర్ ను వివరణ కోరగా తనకు ఎలాంటి సంబంధం లేదని తను ఎలాంటి నిర్మాణాలు చేయమని చెప్పలేదని చెప్పడం గమనార్హం. ఈ స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తున్న ప్రాంతంలో ఇప్పటికీ ఎనిమిది మంది టు వీలర్ ప్రయా ణికులు ప్రమాదంలో మృతిచెందారు. ఈ విధంగా ప్రతి నెల ఒకరు ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతి చెందుతూ ఉండడంతో స్పందించిన పోలీసు యంత్రాంగం ఎస్సై కరుణాకర్‌రావు ప్రమాదాల నివారణ కోసం ఇక్కడ భారీకేడ్లతో మూసి ఉంచారు. సదరు బంకు యజమాని తన స్వార్ధ ప్రయో జనాల కోసం, వ్యాపారం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టాలని ఉద్దేశంతో భారీ కేడ్లను పక్కకు పెట్టి స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం చేపట్టినట్లు స్థాని కులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతంలో పదే పదే ప్రమాదాలు జరుగు తుండడంతో గ్రామస్తులు , పాత్రికేయులు ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి మేరకు పోలీసులు భారీ కేడ్లను ఏర్పాటు చేస్తే వ్యాపారం సజావుగా కొనసాగాలని దురుద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నారని పలువురు ఆరపిస్తున్నారు. వెంటనే జాతీయ రహదారి అధికా రులు చర్యలు చేపట్టాలని, లేదంటే ఆందోళన చేస్తామని గ్రామస్తులు తెలుపుతున్నారు.