Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పస్రా అటవీ క్షేత్ర కార్యాలయ పరిధి వన్య ప్రాణి విభాగం అధికారుల ఆధ్వర్యంలో గుండ్ల వాగు పక్కనే ఉన్న నర్సరీలో నిర్మించిన వాటర్ ట్యాంక్ కొద్ది నెలల క్రితం కూలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికార ఘనం ఊపిరి పీల్చుకున్నారు. గత సంవత్సరంకు ముందు ఈ ట్యాంక్ నిర్మాణాన్ని అధికారులు స్వయంగా మెటీ రియల్ తెచ్చి కూలీలతో నిర్మించారు. పక్క నర్స రీలలో ఉన్న ట్యాంకులు పదిలంగా ఉండి ఈ నర్స రీలో నిర్మించిన ట్యాంకు కూలిపోవడంతో సదరు యంత్రాంగం కంగుతింది. దీనిని సవరించుకునే నేపథ్యంలో నిర్మించిన కూలీ మేస్త్రి పై నెంప నెట్టాలని అతని నుండి పరిహారం రాబట్టాలని పస్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సదర్ మేస్త్రిని పోలీసులు పలుమార్లు విచారించి మాట్లాడు కోవాలని సూచించినట్లు మేస్త్రి రమేష్ తెలుపు తున్నారు. లేదంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు వాపోయారు. ఈ సందర్భంగా మేస్త్రి రమేష్ వివరాలు వెల్లడించాడు. రోజువారి కూలీ డబ్బులు తీసుకొని మాత్రమే రమేష్ ట్యాంక్ నిర్మించాడు. ఇందుకు అవసరమైన సిమెంట్ కంకర ఐరన్ తదితర సామాగ్రి అధికారులు తెచ్చారు. నిర్మాణ క్రమంలో ట్యాంకులు క్యూరింగ్ చేసేవారు ఉండేవారు కాదు. దాని వల్ల కూడా దెబ్బతింది. పనిలో ఉన్న సమయంలో రమేష్ ఒక్కోసారి క్యూరింగ్ చేసే వాడు. కన్స్ట్రక్షన్ జరుగుతు న్నంతసేపు వాటర్ క్యూరింగ్ చేసే అవకాశం ఉండేది కాదని ఆ తర్వాత కూలీలు ఇళ్లకు వెళ్లిపోయే వారిని ట్యాంకు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ కూడా వారే సమకూర్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ట్యాంక్ కూలిందని పరిహారం ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తరచూ పోలీస్ స్టేషన్కు వెళ్లడం పరిపాటైంది. కేసు పెడతాను అని పోలీసులు అనడంతో రమేష్ మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. తన కుటుంబానికి తానే పెద్ద దిక్కునని తనకు ఏమైనా జరిగితే కుటుంబం వీధిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయమై అటవీ క్షేత్ర అధికారిని వివరణ కోరగా తనే వాటర్ ట్యాంకులు పూర్తిగా నిర్మిస్తానని ముందుకు రావడం జరిగిందని, మెటీరియల్ కూడా అవసరమైన స్థాయిలో అతనే తీసుకువచ్చాడని తాము పేమెంట్ చేయడం జరిగిందని తెలిపడం గమనార్హం. అతని అనుభవ రాహిత్యం వల్లే ఈ సంఘటన జరిగిందని తెలిపారు. తిరిగి మెటీరియల్ అందిస్తామని, తిరిగి నిర్మించాలని కోరుతున్నాం. అంతకంటే ఏమీ లేదని అన్నారు.