Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మానేరు, చిన్న చిన్న వాగులపై వృథాగా పారుతున్న జలాలను కట్టడి చేస్తూ భూగర్భజలాలను పెంచుతూ రైతు లకు సాగు, తాగు నీటి సమస్యలను తీర్చాలనే లక్ష్యంతో మానేరు, వాగులపై తెలంగాణ ప్రభుత్వం చెక్ డ్యామ్ల నిర్మాణాలు చేపడుతోంది. గుత్తేదారుల కక్కుర్తి, పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో కోట్ల ప్రజాసొమ్ము దుర్విని యోగానికి గురవుతున్న పరిస్థితి. ఇందుకు మండలంలోని చిన్నతూండ్ల అరేవాగుపై ప్రభుత్వ నిధులు రూ.2.20 కోట్లతో చేపడుతున్న పనుల్లో గుత్తేదారు నాణ్యత ప్రమా ణాలు పాటించడంలేదని, ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడం నిదర్శనం.
ఇటీవల కొందరు రైతులు సైతం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రాకు ఫిర్యాదు చేసిన గుత్తేదారు పనుల్లో నాణ్యత పాటించడం లేదని పలువురు వాపోతున్నారు. అధికారుల ప్రణాళికల ప్రకారం వాగులో పైన 3 పిట్ల ఇసుక,మధ్యలో 8ఫీిట్ల మట్టి,అడుగు భాగంలో బెడ్ కొరకు మరో 12 ఫీట్ల లోతు మొత్తం 23 ఫీిట్ల లోతుతో చెక్ డ్యామ్ నిర్మాణం చేయాలి. కానీ గుత్తేదారు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా చెక్ డ్యామ్ నిర్మా ణం చేస్తున్నటు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా నిర్మాణం చేపడితే పది కలాలపాటుగా ఉండాల్సిన చెక్ డ్యామ్ తేలిక పాటి వరదకే మున్నాళ్ల ముచ్చటగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చెక్ డ్యామ్ నిర్మాణంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు పట్టించుకోని చెక్ డ్యామ్ నిర్మాణ పనులపై పర్యవేక్షణ చేపట్టి పనుల్లో గుత్తేదారు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని మల్లారం, చిన్నతూండ్ల గ్రామస్తులు కోరుతున్నారు.
పనులపై కలెక్టర్ పిర్యాదు
-అవిర్నేని అచ్యుత్ రావు, రైతు
చెక్ డ్యామ్ పనుల్లో గుత్తేదారు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఇటీవల కలెక్టర్ కు పిర్యాదు చేశాము. గుత్తేదారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పనులు చేస్తున్నాడు.అలాగే ప్రక్కనున్న పొలాలు,మిర్చి తోటలు దుమ్ముతో దెబ్బతింటున్నాయి.
నిబంధనల మేరకే నిర్మాణం
-ఇరిగేషన్ ఏఈ
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చెక్ డ్యామ్ పనులు కొనసాగుతున్నాయి.అరేవాగుపై 49 మీటర్ల పొడవుతో, ఇసుక నుంచి భూమి అడుగు వరకు 18 పిట్ల లోతుతో సేడ్ కటాప్ వాల్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఒక లోడర్ లో 8 బస్తాల సిమెంట్ ,4 బస్తాల ఇసుక, 5 బస్తాల కంకర తో అడుగు భాగంలో నిర్మాణం చేయిస్తున్నాం.పైకి పనులు వస్తుంటే ఇంకా ఒక బస్తా సిమెంట్ వెయిస్తాం. గుత్తేదారు నిబంధనలు పాటించకుంటే చర్యలతోపాటు బిల్లులు చేయం.