Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
విద్యార్థి మృతి కారణమైన ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టీఎల్ రవి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవిందరావుపేట మండలంలో చల్వాయి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి రెండవ తరగతి బాలుడు అల్లం రిషిక్(7) ఉపాధ్యాయుల నిర్లక్ష్యంగా మృతి చెందాడని అన్నారు. పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులతో కలిసి కుంటలో దిగిన రిషిక్ ఈత రాక మృతి చెందాడన్నారు. విద్యార్థులు గతం నుంచే రోజు కుంటకు వెళ్లి ఆడుకునేవారని అన్నారు. విద్యార్థి మృతికి కారణమైన ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దశల వారి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు,స్వామి, బాలు, శివ కేశవ, సుమన్ తదితరులు పాల్గొన్నారు.