Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హన్మకొండ
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని ఎస్సీలు మాట ఇచ్చి నేడు వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టకుండా చట్టబద్ధత కల్పించకుండా బీజేప మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఏప్రిల్ 4న నిర్వహించే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దిగ్బంధం విజ యవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మాదిగల సంగ్రామ పాద యాత్రలలో భాగంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ గద్దల సుకుమార్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న ధర్మసాగర్ మండలంలో ప్రారంభమైన పాదయాత్ర 12 వ రోజు ఆదివారం హన్మకొండ అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంద రాజు ఆధ్వర్యంలో పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జన్ను దినేష్ మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా వర్గీకరణ పోరాటానికి మద్దతు తెలుపుతూ వచ్చి 100 రోజుల్లో వర్గీకరణ చేసి న్యాయం చేస్తామని చెప్పి మోసగించిందన్నారు. దీంతో రిజర్వేషన్ వాట రాకుండా విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వెనకబడి పోతున్నారన్నారు. ఏప్రిల్ 4 న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను లక్షలాది మంది దళితులు పాల్గొని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంద రాజు, ఎంఎస్పి జిల్లా ఇంచార్జి గంగారపు శ్రీనివాస్, ఎంఎస్పి జిల్లా కోఆర్డినేటర్ప, పల్లె ఉదరు తదితరులు పాల్గొన్నారు.