Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన మొత్తంలో కొద్ది పాటీ డబ్బులను పొదుపు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఉపయోగపడతాయని, పొదుపుతోనే అభివృద్ధి ఉంటుందని పురుషుల పొదుపు సంఘం సమితి అధ్యక్షుడు ఎండీ ఉస్మాన్ అన్నారు. మండలంలోని ప్రగతిసింగారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర పురుషుల పొదుపు సంఘం 18వ వార్షిక మహాసభ ఆదివారం సంఘం అధ్యక్షుడు పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సంఘం నివేదికను చదివి విని పించారు. పురుషుల పొదుపు సంఘం 105 మంది సభ్యులతో 10,500 నిధులతో 2005 లో ప్రారంభమై, ప్రస్తుతం 266 మంది సభ్యులతో సొంత భవనం కలిగి 56 లక్షలు నిధులతో ముందుకు దూసుకెళ్తోందని తెలిపారు. సంఘ సభ్యులందరూ సంఘటితంగా కలిసి సంఘం అభివద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘం అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా చిలుకల రాజన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సంఘం పాలకవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.