Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
అనుభవం లైసెన్స్ లేని డ్రైవర్లతో తక్కువ జీతాలతో వాహనాలు నడిపిస్తూ ప్రజల ప్రాణా లతో చెలగాటమాడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా నాయకు లు పసుల వినరుకుమార్ మండి పడ్డారు. మండ లంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వినరుకుమార్ మాట్లాడారు. రెండు రోజుల క్రితం మండలంలోని రాయపల్లి గ్రామానికి చెందిన దాసరి రాజిరెడ్డి పని నిమిత్తం రేగొండకు తన టీవీఎస్ ఎక్సెల్ బండి పై వచ్చి ఎరువుల బస్తాలు వేసుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో రంగయ్యపల్లి గ్రామంలో రేగొండ రెడ్డి చికెన్ సెంటర్కు సంబంధించిన బులోరా వాహనం ఎదురుగా ఢకొీట్టడంతో రాజిరెడ్డి రెండు కాళ్లు పూర్తిగా విరిగి తలకు బలమైన గాయాలు అయ్యాయన్నారు. దీంత ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందడం బాధాకరమని అన్నారు. రెడ్డి చికెన్ సెంటర్ యజమాని లైసెన్స్ లేని యువకులతో వాహనం నడిపించడం వల్లే ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజిరెడ్డి కుటుం బానికి న్యాయం చేయాలని, రెడ్డి చికెన్ సెంటర్ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయాలని కోరారు.