Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాడ్వాయి
ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన కాంగ్రె స్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి దశదినకర్మకు ఆదివారం ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షులు జాలపు అనం తరెడ్డి, మాజీ జెడ్పిటిసి బొల్లు విజయ దేవేందర్ ల అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. మొదట నల్లెల కుమారస్వామి చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నల్లెల కుమారస్వామి కాంగ్రెస్ పార్టీకి, పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నల్లల కుమారస్వామి మతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, కామారం సర్పంచ్ రేగ కళ్యాణి, రంగాపూర్ సర్పంచ్ అశ్విని సూర్యనారాయణ, జిల్లా సీనియర్ నాయకులు ఆర్రెం లచ్చు పటేల్, మాజీ సర్పంచులు లంజపెల్ల నరసయ్య, బెజ్జూరి శ్రీనివాస్, ముజఫర్, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చెర్ప రవీందర్, సింగిల్ విండో డైరెక్టర్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మడి ముత్తయ్య వెంకటనారాయణ బానిస సమ్మయ్య దుబ్బాసి సుధాకర్ పురుషోత్త నారాయణ తదితరులు పాల్గొన్నారు.