Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ ఎండి యూసఫ్
- గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జాతీయ నాయకులు బోస్
నవతెలంగాణ-కోల్బెల్ట్
ఎంతో కాలంగా పోరాటాలు నిర్వహించి సాధిం చుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడలుగా మార్చి కార్మిక ద్రోహిగా మోడీ నిలిచారని ఏఐటీ యూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్, గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జాతీయ నాయకులు బోస్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంజూరు నగర్ లోని 1000 కోటర్స్ సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఏఐటీ యూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కు మార్ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సం ఘం యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలు అత్యం త వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూ నియన్ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ముందుగా మిరియాల రంగయ్య ఈ సందర్భంగా అరుణ పథకాన్ని ఎగురవేశారు. అనంతరం అమ రుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు నివాళులుర్పించారు. ఈ మహాసభలకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న పదకొండు డివిజన్లోని ఉన్న కాంట్రాక్టు కార్మికులు సుమారు 500 మంది పాల్గొన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం యూనియన్ మహాసభలతో ఈ ప్రాంతమంత ఎరుపు రంగుగా మారింది. వందలాదిమంది కార్మి కులు ఈ సభలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఏఐటీయూసీ నాయకులు మాట్లా డుతూ.. దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలం భిస్తున్న మోడీని గద్దె దించేంతవరకు కార్మికులత ఐక్య పోరాటాల సిద్ధం కావాలన్నారు. మోడీ ప్రభు త్వం ఆదానే అంబానీలకు కొమ్ముకాస్తుందని, ప్రభు త్వ రంగ సంస్థలను కారు చౌకగా పెట్టుబడుదా రులకు కట్టబెడుతుందన్నారు. ఆదానీ, అంబానీ ఆస్తులను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మిక హక్కులను ,శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాం ట్రాక్టు కార్మికులకు హైపర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవే టుపరం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయన్నారు. ప్రధాని మోడీని గద్దె దించేం తవరకు పోరాటాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో 2014 తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ చేసి వారికి కనీస వేతనాల అమలు చేస్తానని ఒక్క హామీను నెర వేర్చలేదన్నారు. కార్మిక సమస్యలను పరిష్కరించడం లో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కార్మిక హక్కులు ఏఐటీయూసీ ద్వారానే సాధ్యమని అన్నా రు. అనంతరం భవిష్యత్తులో నిర్వహించే పోరాటా లపై కార్మిక సమస్యలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ మహాసభల్లో మిరియాల రంగయ్య, సారయ్య, వైవి రావు, వీరభద్రయ్య, బాజీ సైదా, ఎల్ ప్రకాష్ ,ఉష్క సమ్మయ్య, రామ్ గోపాల్, వీరస్వామి, మడ్డి ఎల్లయ్య, కిషన్ రావు, మోట పలుకుల రమేష్, కొమురయ్య, కిష్టపర్, తిరుపతి, సత్యనారాయణ, మల్లికార్జున్, క్యాత్రజు సతీష్, వెంకటలక్ష్మి, కనకతార, బుర్ర వీరేశం, పోశం, సురేష్, సతీష్, రమేష్, 500 మంది కార్మికలు నాయకులు పాల్గొన్నారు.