Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కన్నాయిగూడెం
మండలంలోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ముఖ్యకర్తల సమావేశం జరిగింది. రైతు బందు సమితి ములుగు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య హాజరుకాగా వారు మాట్లాడారు. మండలంలో జరిగే అభివృద్ధి పను లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేర్చాలని అన్నారు పార్టీ కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడాలని అన్నారు.పార్టీ ప్రధాన కార్య దర్శి పూజారి, మండల ఉపాధ్యక్షుడు చిలుముల రాంబాబు, సత్యనారాయణ మండల సీనియర్ నాయకులు కావేరి చిన్ని కృష్ణ, తడకల మధుకర్, రాంబాబు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మావూరి గారి వెంకటయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు తిరుపతి ప వెంకటయ్య , దేవర సుధాకర్ వాసంపెళ్లి రాంబాబు,సర్పంచ్ ప్రభాకర్ , ముత్తయ్య పాల్గొన్నారు.