Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తొర్రూరులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు డైన మిక్ లీడర్ కాబోయే ముఖ్యమంత్రి ఐటీ శాఖ మాత్యు లు కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నందున మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవా రం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కా ర్యాలయంలో సభపై సమీ క్షా సమావేశం ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో ప్రతి సంవత్స రం మహిళ దినోత్సవ వే డుకలను నిర్వహించడం జరుగుతుంది కానీ ఈసారి తొర్రూరులో నిర్వహించడం జరుగుతుందన్నారు. ని యోజకవర్గం వ్యాప్తంగా రూ.3 కోట్ల నిధులు మం జూరు చేయడం జరుగుతుంది అన్నారు.
రూ.3.50 కోట్లు అభయ హస్తం చెక్కును ఇవ్వ డం జరుగుతుంది అని తెలిపారు. కుట్టు మిషన్ శిక్ష ణతో 10 వేల మంది మహిళలకు ఉపాధి అవకాశం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. మొదటి నుంచి మహిళల అండదండలు నాకు పూర్తిస్థాయిలో ఉండ డం సంతోషకారం అని వ్యాఖ్యానించారు. మహిళలు స్వచ్చందగా సభకు తరలిరావాలని కోరారు. తదుపరి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సంపత్రావు, మండల స మాఖ్య అధ్యక్షురాలు అమరావతి, ఎంపీడీఓ కిషన్, ఎంపిఓ రాంమ్మోహన్,రైతు బంధు మండల కోఆర్డినే టర్ సురేందర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, మహిళ నాయకురాలు వనజరాణి, సర్పంచ్లు గారె నర్సయ్య, గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఐత రాంచం దర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు త దితరులు పాల్గొన్నారు.