Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మహిళల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృ షి చేస్తోందని ఎమ్మెల్యే అరూరి రమే ష్ అన్నారు.వరంగల్ జిల్లా పర్వత గిరి మండల కేంద్రం లోని జెఆర్ఆర్ గార్డెన్లో అంతర్జాతీయ మహిళా ది నోత్సవం సందర్భంగా వివిధశాఖల మహిళా అధికారులు, మహిళా సం ఘాల సభ్యులను ఎమ్మెల్యే రమేష్ శా లువాలతో సన్మానించారు. అలాగే అరూరి గట్టుమళ్లు ఫౌండేషన్ ద్వారా సంక్రాం తి పండుగ సందర్భంగా మండలంలోని అన్నిగ్రామాల్లో ముగ్గుల పోటీలు, క్రీడలు నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన మహిళలకు ప్రోత్సాహక బహు మతు లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళల అభి వృద్ధే లక్ష్యంగా పెట్టుకుని పలు సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్న ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందన్నా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలం గాణ రాష్ట్రంలో మహిళల పట్ల అపారమైన గౌరవం పెరిగిం దని వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంత రం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సంపత్ రావు, ఎంపీపీ లునావత్ కమల, జెడ్పీటీసీ బానోత్సిం గు లాల్, తహ శీల్దార్ కోమిఅజ్మీరా, ఎంపీడీవో చక్రా ల సంతోష్ కు మార్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.