Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అరూరి కుమార్
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ మండల పరిధిలోని రామన్నపేట 29వ డివిజన్ రఘునాథ్ కాలనీ లో గత 25 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న 400 కుటుంబా లకు రాష్ట్ర ప్రభుత్వం 58 జీవో వర్తింపజేసి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ గోపికి వినతిపత్రం అందించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాల యం ప్రజావాణి కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అరూరి కుమార్ రఘునాథ్ కాలనీ సీపీఎం నాయకులు, కార్యకర్తలతో కలిసి కలెక్టర్కు వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆరూరి కుమార్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన 125 గజాలలోపు ప్రభుత్వ భూము లలో నివాసం ఉంటున్న వారికి ఉచితంగా క్రమ బద్ధీకరణ చేయాలనే నిర్ణయంను స్వాగతిస్తూ గత 25 ఏళ్లుగా రామన్నపేట మల్లికార్జునస్వామి దేవాలయ భూమిలో గుడిసెలు వేసుకొని నివాస ముంటున్న నిరుపేదలకు 58 జీవోను వర్తింపజేసి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, ఇటీవ ల ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను కలెక్టర్ కార్యాలయ అధికారులు ,సిబ్బందితో ఇంటింటికి దరఖాస్తుల పరిశీలన చేసే స్వయంగా సర్వేలు నిర్వహించా రని, ఇం దులో 2014 ముందున్న ఆధారాలు పేద ప్రజలు వారికి దరఖాస్తు తో పాటు చూ పించడం జరిగిందని దరఖాస్తులను ఆ అమలులోకి వచ్చే విధంగా 58 జీవోను వర్తింపజేసే విధంగా చూడాలని కలెక్టర్ ని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోపి స్పందిస్తూ ఈ విషయాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దామెర శ్రీనివాస్, మాదాసు వీరస్వామి, జన్ను యాకయ్య, దేసు క పిల్, దాసరోజు చెరమందచారి దరిపెళ్లి కుమార్, సింగారపు సుమన్, నరాశి శంక ర్, సౌరం ఆనందం, తదితరులు పాల్గొన్నారు.