Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్సిడీ విద్యుత్ మోటర్ల పంపిణీలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయానికి దిగ్గులేని స్థితికి తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తూ స బ్సిడీలను ఎత్తేసే చర్యలకు పూనుకుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో రైతులకు 250 సబ్సిడీ విద్యు త్ మోటర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాటా ్లడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ వ్యవసా య రంగాన్ని ముందువరసలోకి తీసుకెళ్తుండగా కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవ సాయం నుంచి రైతులను దూరం చేసేందుకు పావు లు కదుపుతుందని విమర్శించారు.ఎరువులపై రూ.10 వేల కోట్ల సబ్సిడీకి కుదించేసిందని, ఉపాధి హామీ పథకానికి రూ.30 వేల కోట్లకు తగ్గించిందని తెలిపారు. మరో వైపు పంటోత్పత్తులను కొనుగోళ్లపై చేతులెత్తేస్తుందని బియ్యం కొనుగోలు చేయకుండా ఎఫ్సీఐచే అనేకఆంక్షలు విధిస్తుందని, పత్తి కొనుగోళ్ల కు సీసీఐకి కేవలం రూ.1లక్ష మాత్రమే కేటాయించ డమే ఇందుకు నిదర్శణమన్నారు.
ఇలాఅయితే ఈ రెం డు ప్రభుత్వ రంగసంస్థ లు పంట ఉత్పత్తులను ఎలా కొనుగోలు చేయగలు గు తాయని ప్రశ్నించారు. కేంద్రం రైతును వ్యవసా యం నుంచి పొమ్మనలేక పొగపెడు తుందని ఆందో ళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసా యానికి అనుసంధానం చే యాలని అసెంబ్లీతీర్మాణం చేసి సీఎం కేసీఆర్ కేంద్రా నికి లేఖ రాసి పంపితే ఇప్పటిదాకా కేంద్రం స్పందిం చలేదన్నారు. అనుసంధానం చేసినట్లయితే ప్రతి ఎక రానికి రైతుకు 50 నుంచి 100 టోకెన్లు వస్తే రైతు కు పెట్టుబడి భారంతగ్గుతుందని, కూలీలకు సరిపడా పనిదినాలు కూడా దొరుకుతాయన్నారు. ఇవి మరిచి ఏకంగా ఉపాధిహామీ పథకాన్నే ఎత్తేసే కుట్రలు చే సుందని దుయ్యబట్టారు. కూలీలు, రైతులు కేంద్ర ప్ర భుత్వం చేస్తున్న ఈవ్యతిరేక చర్యలను 9నుంచి చేప ట్టనున్న పోస్టుకార్డుయుద్ధంలో పాలుపంచు కోవాల న్నారు. నియోజకవర్గంలో పాకాల, రంగయ చెరువు లకు గోదావరి నీళ్లు తీసుకొచ్చామని,కాళేశ్వరం ప్రాజె క్టుతో నేడు ఎస్సారెస్సీ కాల్వల ద్వారా 300ల పైగా చె రువులను నింపుకొని రెండో పంటకు సవృద్ధిగా నీళ్లం దిస్తున్నామని తెలిపారు. ఫలితంగా నియోజకవర్గం లో పంటోత్పత్తులు గణనీయంగా పెరిగుతున్నాయని అందుకనుగుణంగా సరిపడాలక్ష మెట్రిక్ టన్నుల సా మర్థ్యం కలిగిన గోదాములను నిర్మాణం చేసి అందు బాట్లోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు.
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పైలెట్ ప్రాజె క్టును తీసుకొచ్చి రూ.7.51 కోట్ల విలువజేసే 5,010 యూనిట్ల సబ్సిడీ కరెంట్ మోటర్లను తీసుకొచ్చా మని తెలిపారు. ఇప్పటి వరకు 2,589 యూటిట్ల ను పంపిణీ చేశామని మిగతావి ధరఖాస్తులు ఇచ్చిన కొద్ది రోజుల్లోనే అందుతాయని తెలిపారు. కిందటేడా ది వడగండ్ల వానకుపంటలు దెబ్బతిని రైతులు నష్ట పోయారని త్వరలోనే నష్టపరిహారం రైతులకు అంది స్తామన్నారు. నిబంధనల రీత్యా కేంద్ర చట్ట ప్రకారం నష్టపరిహారం ఎకరాకు రూ.5,400 చెల్లించాల్సి ఉం దని ఇది కొంత రైతుకుల ఊరట ఇచ్చినా జరిగిన న ష్టం పూడ్చలేమని ప్రత్యేకంగా రైతులకు సబ్సిడీ పీవీ సీ పైపులు అందించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలి పారు. త్వరలోనే రూ.10వేల మంది రైతులకు పీవీసీ పైపులు అందజేస్తామన్నారు.
నియోజకవర్గ భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక బద్దంగా ప్రతి రైతుకు వ్యకిగతం గా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. వీ టన్నింటిని రైతులు సద్వినియోగం చేసకోవాలని సూ చించారు. మరిన్ని ఆశీస్సులు అందించినట్లయితే ని యోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకె ళ్లేందుకు నిర్విరామంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్య క్రమంలో ఎంపీపీ బాధవత్తు వీరేంద ర్, నర్సంపేట, నల్లబెల్లి పీఏసీఎస్ మురాల మోహన్ రెడ్డి, చెట్టుపెల్లి మురళీధర్‌రావు, రైతుకో-ఆర్డినేటర్లు బుర్రి తిరుప తి, మోతె పద్మనాభరెడ్డి, కాట్ల భద్రయ్య, ఊడ్గుల ప్రవీ ణ్, నామాల సత్యనారాయణ పాల్గొన్నారు.