Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
మూడవిశ్వాసాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ములుగు పోలిస్ స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం బంజరుపల్లి గ్రామంలో అవగాహన సదస్సు చేపట్టారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఓఎస్డి అశోక్‌కుమార్ పాల్గొని గ్రామంలోని పరిస్థితులను పరిశీలించారు. ప్రజల జీవన స్థితిగతులను, వారి వత్తి ఉపాధి అక్ష రాస్యత వంటి విషయాలను స్థానిక ప్రజలను, అధి కారులను, గ్రామ యువతను అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ఎటువంటి సమ స్య ఎదురైనా పరిష్కరించేందుకు ములుగు జిల్లా పో లీస్ ముందుంటుందని అన్నారు. దానికోసం స్థానిక కానిస్టేబుల్స్, ఎస్సై, సీఐ వంటి అధికారులు ఉన్నా రని తనను కూడా స్వయంగా కలిసి తమ సమస్యను విన్నవించుకోవచ్చునని అన్నారు. చదువుకున్న యువత గ్రామంలో కమిటీగా ఏర్పడి గ్రామంలోని పెద్దలను,చదువు లేక ముడవిశ్వాసాలు నమ్మే వారికి అవగాహనా కల్పించాలన్నారు. బంజరుపల్లి ఘటన తనను బాధించిందని ములుగు జిల్లా కేంద్రంలో ఉండి అన్ని రకాల ప్రభుత్వ ఆఫీస్‌లు కూతవేటు దూ రంలో ఉండి ఇలాంటి ఘటనలు జరగడం దుర దృష్టకరమని అన్నారు. ప్రభుత్వం నుండి అందిం చబడే ప్రతి అవకాశాన్ని, సంక్షేమ పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. బంజరుపల్లి గ్రా మంలో కొంత మంది అసాంఘిక కార్యక్రమాలు చేప డుతున్నట్టు తన దష్టికి వచ్చిందని, వారి మొత్తం వివరాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. వారిని వదిలే ప్రసక్తి లేదని, క్రిమినల్ కేసు లు నమోదు చేస్తామని హేచ్చరించారు. ఇలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలని అన్నారు. ఓఎస్డి అశోక్ కుమార్ మాట్లాడుతూ మూఢనమ్మకాలు కాలం చెల్లిన చట్టావ్యతిరేక చర్యలని, వాటిని అవలంభించి ఇతరులకు హాని తలపెడితే చర్యలు ఉంటాయని హేచ్చరించారు. వారికీ చట్టపరంగా ఎటువంటి న్యాయం కోసం అయినా తమను సంప్రదించవచ్చు నని అన్నారు. అనారోగ్యం పరంగా కూడా మూఢ విశ్వాసలను నమ్మవద్దని ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐ మేకల రంజిత్ కుమార్, ఎస్ఐ ఓంకార్‌గారు, గ్రామ పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు.