Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మహాదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఇఖో క్లబ్ కమిటీ కన్వీనర్ టి రజిత ఆధ్వర్యంలో ఇఖో ఫ్రెండ్లీ హౌలీ ఉత్సవాన్ని నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రహత్కణం హాజరై ప్రసంగించారు. కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు టి రజిత కమిటీ మెంబర్ అష్రాసుల్తానా, సహకారంతో విద్యార్థులు రంగుల తయారీ గురించి వివరించారు. ఈ రంగుల స్టాళ్లను సందర్శించిన ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన పూలు మొక్కలు వాడడం వలన విద్యా ర్థులు సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించి పర్యావరణాన్ని కాపాడిన వారవుతారని అన్నారు. కెమికల్స్ రంగులను వాడడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తు కాకుండా శాశ్వతంగా చూపును కోల్పోయే ప్రమాదం ప్రమాదంతో పాటు శారీరక రుగ్మతలకు కారణం అవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వ హించి సమాజ మార్పుకి తోడ్పడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, మున్నయ్య, విజయ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాజు, రాజేందర్, రమేష్, రవీందర్, మహేష్, వేణుగోపాల్, కరీంబి, శివకష్ణ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.