Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ములుగు
రిషిక్ మరణానికి గల కారకులను శిక్షించాలని, ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని బీఎస్పీ జిల్లా ఇన్చార్జి బోట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి బిఎస్పి గోవిందరావుపేట మండల అధ్యక్షులు కోగల అజరు ఆధ్వర్యంలో సోమవారం కలిసి వినతిపత్రం అందించి కార్తిక్ మాట్లాడారు. చల్వాయి ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఆలం రిషిక్ ఇంటర్వెల్ సమయంలో మూత్రానికి వెళ్లి చెరువుకుంటలో పడి మరణించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అసమర్ధత వల్లనే ఈ ఘటన జరిగిందని అన్నారు. విద్యార్థి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఎస్పీ జిల్లా అధ్యక్షులు శనిగరం నరేష్ కుమార్ మాట్లాడు తూ జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి రిషిక్ కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం బీఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు పసిలాది ముఖేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సరిపడా అటెండర్లను వాచ్మెన్లను ఏర్పాటు చేయాలని అన్ని సౌకర్యాలు పిల్లలకు అందుబాటులో ఉండేటట్టు చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోవిందరవుపేట మండల అధ్యక్షులు అజయ్ కుమార్, బివిఎఫ్ కన్వినర్ గడ్డం ప్రవీణ్, మహిళ నాయకులు దుర్గ,బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..