Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునిసిపల్ చైర్పర్సన్ వెంకటరాణి సిద్దు
నవతెలంగాణ-భూపాలపల్లి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ సగం వెంకటరాణి సిద్దు సూచించారు. సోమవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశం మేరకు మున్సిపల్ శానిటైజేషన్, స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా, మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్ భానోత్.రజిత జుమ్ములాల్ అధ్వర్యంలో, వేశాలపల్లి లో సైడ్ డ్రైనేజీ,మరియు చెత్త ను పిచ్చి మొక్కలను శుభ్రం చేపట్టారు కాగా పనులను చైర్మన్ వెంకటరమణ సిద్దు పరిశీలించి సిబ్బందికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు శానిటైజేషన్ పనులు నిరంతరం కొనసాగించాలని ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఉపాధ్యక్షులు మోతెరాజు, డైరెక్టర్ గురిజాలశ్రీనివాస్, 11వ వార్డు అధ్యక్షులు దుండ్రకుమార్, యూత్ అధ్యక్షులు కొడారీరాజు, మహిళ అధ్యక్షురాలు ఈర్లస్వప్న, నాయకులు తాతసంపత్, గంటలక్ష్మణ్, కీర్తి సదానందం, తాతసంపత్, తాతశ్రీధర్ , పర్శావేనిసాంబయ్య, మేకల తిరుపతి, తదితరులు పాల్గోన్నారు.