Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ములుగు జిల్లా కేంద్రంలో వెంకటాపురం (నుగూరు) మండలం లోని ముర్రవానిగూడెం ఇసుక సొసైటీ కమిటీని మార్చాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి, సర్పంచ్ మడకం సారయ్య, ఎంపీటీసీ సున్నం సాంబశివరావు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ కు వినతిపత్రం అందించారు. అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామ సొసైటీలో 2013 నుండి ఇప్పటి వరకు ముర్రం రామలక్ష్మి అధ్యక్షులుగా కొనసాగుతూ ఏకపక్షంగా నియంతత్వంగా కొనసాగుతూ అడిగిన వారిని సభ్యత్వం తొలగిస్తానని బోనస్ ఇవ్వనని అనేక వేధింపులకు గురి చేస్తూ కొనసాగుతున్నదని అన్నారు. బైలా ప్రకారం మూడు నెలలకు ఒకసారి కమిటీ మార్చు కోవాలని, కానీ గ్రామంలో సొసైటీ సభ్యుల మధ్యల పం చాయతీ పెడుతూ గ్రామంలో అడిగిన వారిపై పోలీ సులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే కమిటీని మార్చాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఎలాంటి తీర్మానాలు చేయకూడదని తెలి పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు సున్నం నరసింహారావు, సున్నం నగేష్ మొరం మల్లేష్ , కొడితే లక్ష్మయ్య, కొడితే నయోబి, యాసం వెంకటరమణ, సున్నం అంజమ్మ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.