Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక ఉద్యోగుల న్యాయ వేదిక
- రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ యాసిన్
నవతెలంగాణ - ములుగు
ప్రాంతీయ పార్టీలకు ముస్లిం ప్రజలు అండగా నిలుస్తున్నారని సామాజిక ఉద్యోగుల న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ యాసిన్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో సామాజిక ముస్లిం న్యాయ వేదిక జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అధ్యక్షతన ముస్లింల ముఖ్యుల సమావేశం నిర్వహించి యాసిన్ మాట్లాడారు. స్వాతంత్ర సంగ్రామం, సిపాయిల తిరుగు బాటులో ప్రాణాలు అర్పించి దేశ స్వాతంత్య్ర సాధనలో ముస్లింలు ముందు న్నారన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. మనువాద ముసుగులో ఉన్న పార్టీ ముస్లింల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించడం లోను విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ రంగాలలో ప్రాధాన్యత కల్పించ కుండా వివక్షకు గురిచేశారన్నారు. ఈక్రమంలో ఆపార్టీకి దూరమై ప్రాంతీయ పార్టీల కు దగ్గరైనారన్నారు. ప్రాంతీయ పార్టీల గెలుపుకు కషిచే స్తున్నారనీ, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ను సకల జనుల సమ్మెలో పాల్గొని స్వరాష్ట్ర ఉద్యమం కోసం అహర్నిశలు కషి చేసి బీఅర్ఎస్ ను గెలిపించిన ఘనత ముస్లింలదేనని అన్నారు. అయినా ముస్లింలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. ముస్లిం ఫెడరేషన్ ఏర్పాటు చేసి జనాభా దామాషా ప్రకారం నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ను నామినేటెడ్ పద వుల్లోను పార్టీ పదవుల్లోను ప్రాధాన్యత లేదన్నారు. తమకు ప్రాధాన్యత నిస్తే దేశ వ్యాప్తంగా ముస్లింలను కూడ గట్టి బీఆర్ఎస్కు మద్దతునిస్తామని అన్నారు. అనంతరం మహమ్మద్ యాసిన్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం న్యాయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ రఫతుల్లా, మహామ్మడ్ సర్వర్ యాకూబ్ పాషా, రషీద్ ,ఎక్బాల్ , చాంద్ పాషా, కుతుబొద్దిన్ తదితరులుపాల్గొన్నారు.