Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పుట్ట లింగమ్మ ట్రస్ట్ సౌజన్యంలో ఇన్ స్పైర్అండ్ ఇగ్నైట్ సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు సోమవారం వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. క్రమశిక్షణ అలవర్చుకుంటే ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నతంగా రాణించవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు అన్వేష్ అన్నారు. విద్యార్థి చదువులో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. 10లో 10/10జీపీ ఏ సాధించొచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రవణ్ అన్నారు. ధ్యానంతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని అన్నారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు బాగా రాయగలరని అన్నారు. సర్పంచ్ శ్రీపతిబాపు మాట్లాడుతూ పరీక్షల సమ యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు ఉపయోగపడతాయని అన్నా రు. విద్యారంగ అభివృద్ధికి పుట్ట లింగమ్మ ట్రస్ట్ కృషి అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అలీం ఖాన్,జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, ప్రధానోపాధ్యాయులు అశోక్, సతీష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.