Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మహిళ సాధికారిక సాధన దిశగా ముందుకు పయనించాలని ఎస్టియు ములుగు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ శిరీష సతీష్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని చల్వాయి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఎస్ టి యు గోవిందరావుపేట శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ముందుగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని , సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో ఎదగాలన్నారు. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సోలం కష్ణయ్య మండల శాఖ అధ్యక్షుడు జన్ను సామ్సన్ స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి మరియు ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.