Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా మహిళలకు భరోసా...
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏక కాలంలో మూడు జిల్లాలో అధికార ప్రజాప్రతినిధిగా ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో జిల్లాలో శాయం పేట మండల జడ్పీటీసీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షురాలుగా ఏకకాలంలో అధికార ప్రతినిధిగా సేవలందిస్తూ ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రం లోనే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అధికార పార్టీ తరుపున సేవలం దిస్తూనే మరొకవైపు మారథాన్ క్రీడాకారిణిగా పరుగెడుతూ యువతకు స్ఫూర్తిగా, మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె జెడ్పీచైర్‌పర్సన్ గండ్ర జ్యోతి. మహిళా దినోత్సవ సందర్భంగా ఆమె 'నవ తెలంగాణ వఖాముఖితో మాట్లాడారు.
నవతెలంగాణ : మీ రాజకీయ జీవితం....
గండ్ర జ్యోతి : నా రాజకీయ జీవితం 2004 లోనే వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్‌గా గెలుపొంది అనతి కాలంలో కింది స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నా భర్త ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రోత్సాహంతో రాజకీ యంగా అంచలంచలుగా ఎదిగాను. వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతుండడం సంతోషకరమైన విషయం.
మహిళలకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు..
పూర్వం లాగా కాకుండా ఇప్పుడు పురుషులతో సమా నంగా మహిళలు అన్ని హక్కులు కలిగి ఉన్నారు. విద్య, వైద్య రాజకీయ రంగాల్లో 50శాతం మహిళలే కొనసాగుతున్నారు. మహిళా సంఘాల ద్వారా కుట్టు మిషన్లు ఏర్పాటు చేసు కోవాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం తరఫున ఆర్థికంగా రుణం పొంది జీవితంలో ముందుకు సాగాలి. కొంత మంది ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తున్నాము. కానీ ఇలాంటి చర్యలకు తావివ్వకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అన్ని రంగాలలో ముందుండాలి.
మహిళలకు చేసిన కార్యక్రమాలు ఏంటి
మా మామగారు గండ్ర మోహన్ రెడ్డి పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియమా కాల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో సుమారు 2000 మందికి ఎస్సై కానిస్టేబుల్ గ్రూపు 1, గ్రూప్ 2 అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఇందులో 800 మంది మహిళలు ఈ శిక్షణలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. దీని ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి లైసెన్సులు కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు కోలాటాల పోటీలు నిర్వహిస్తున్నాం.
వెంకటేశ్వర ఆలయం నిర్మాణానికి కారణాలేంటి..
మూడు సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనకాల ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ప్రోత్సాహంతో కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపటాం. జూన్ 24 2022న ప్రారంభమైన ఆలయం నిర్మాణానికి తిరుపతి నుండి శిల్పాలు తీసుకొచ్చాం. తిరుపతి చెందిన శిల్పులచే ఈ నిర్మాణం కొనసాగుతుంది. నిర్మాణం ప్రారంభమైన నాటి నుండి పూర్తి అయ్యేవరకు భోజనం చేయకుండా ఉడికిన ఆహారం తీసుకోకుండా పండ్లు, రసాలతో ఉపవాస దీక్ష చేస్తున్నాను. మే లేదా జూన్‌లో ఆలయం ప్రారంభానికి సిద్ధం కానుంది.
పార్టీ అభివద్ధికి ఏం చేస్తున్నారు..
జిల్లా నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు వెళ్తూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కషి చేస్తా. ఇప్పటికే గ్రామ స్థాయిలో పార్టీ బలం గా ఉంది. అయినా గ్రామగ్రామాన పర్యటించి బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై చిన్నచిన్న సమస్యలు ఏమైనా ఉంటే తొలగించేం దుకు ప్రయత్నిస్తా. పార్టీ కోసం పని చేసే కార్యక ర్తలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ ఎంక్రేజ్ చేస్తా. వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పని చేస్తున్న ప్పటికీ ఇక్కడి ప్రజలకు కూడా గడిచిన మూడేళ్లుగా అందు బాటులో ఉంటున్నా. ప్రభుత్వ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను ప్రవేశపెడుతున్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి
తెలంగాణలో గడిచిన 8 ఏళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వ పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుల సహ కారం, సూచనలు, సలహాలతో బీఆర్ఎస్ పథ కాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి, ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తా. గత నెల 23న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాల యాన్ని ప్రారంభించడం జరిగింది. దీంతో బీఆర్ఎస్లో మరింత ఉత్సాహం నెలకొంది.
వడ్డీ లేని రుణాలు మంజూరయ్యాయా ?
నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం కానుక ఇచ్చింది. గత రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణా ల నిధులు చేసింది. పురపాలికల్లోని మహిళా స్వయం సహా యక సంఘాల కోసం రూ.250 కోట్లు వడ్డీ లేని రుణాల నిధులు, మరో రూ.500 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు విడుదల చేసిన ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.