Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోమలగడ్డ సర్పంచ్ మంగ ఎలేంద్ర
నవతెలంగాణ-గోవిందరావుపేట
మహిళలు పోటీ తత్వంతో ప్రతి రంగంలోనూ ముందుకు సాగాలని సోమలగడ్డ సర్పంచ్ మంగ ఎలేంద్ర అన్నారు. అంతర్జా తీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం సర్పంచ్ ఏలేంద్ర నవ తెలంగాణతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసి స్తున్న మహిళలు మరింత అక్షరాస్యతను సాధించి ఆర్థిక అక్షరా స్యతను పెంపొందించుకోవాలని సూచించారు.పల్లెల్లో చదువుకొని చదువు రాని మహిళలను గుర్తించి వారి అక్షరాస్యతపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వము మహిళా సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు కషి చేయాలని సూచించారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కొందరు సంతకాలకు మాత్రమే పరిమితం కాగా మరి కొందరు వేలిముద్రలు వేస్తున్నారని వీరిని గుర్తించి అక్షరాస్యతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం మహిళలు పురుషులతో పాటుగా దీటుగా వ్యవసాయ రంగంలో కొనసాగుతూ కుటుంబ ఆర్థిక వ్యవ స్థలో భాగస్వాములు అవుతున్నారు. అక్షరాస్యతతో మహిళలు బా ల్యం విద్యార్థి దశ భర్త పిల్లలు కుటుంబం తదితర సమస్యలపై అవ గాహన పెంచుకోగలుగుతారు. ఒక కుటుంబం బాగుంది అంటే ఆ కుటుంబంలో ఆ ఇంటి ఇల్లాలు పాత్ర చాలా కీలకమైనదిగా గుర్తిం చాలి. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై గహిణి మాత్రమే చెక్క పెట్టగలదు. పల్లెల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు ప్రతి రంగంలోనూ పోటీ పడుతూ కీలకంగా రాణిస్తున్నారు పరిపాలన తదితర అంశాల్లో కూడా మహిళ ప్రజా ప్రతినిధులు చక్కగా రాణిస్తూ గ్రామాలు గ్రామ పంచాయతీలు అభివద్ధి పథంలో కొనసాగుతున్నాయి. పరిపాలన విషయంలో తామేమి తక్కువ కాదన్నట్టుగా మహిళ ప్రజా ప్రతి నిధులు నిత్యం శ్రమిస్తూ అభివద్ధి పథంలో అందరికీ ఆదర్శంగా నిలు స్తున్నారు. ముందు ముందు గ్రామీణ ప్రాంతాల్లో మొదలుకొని అంత ర్జాతీయస్థాయిలో అన్ని రంగాల్లో మహిళలు అద్భుతంగా రాణిం చాలని ఆశిస్తున్నానని తెలిపారు.