Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్మసాగర్ తహశీల్దార్ మార్కాల రజిని ఇంటర్వ్యూ
పువ్వుపుట్టగానే పరిమళిస్తుంది అనేమాట ఒకప్పటిది. పుట్ట గానే కాదు. క్రమక్రమంగా పరిమళిస్తుంది.అనే మాటను త నకు ఆపాదించుకొని జీవితంలో తనకు ఎదురైనా కష్టాల నుమెట్లుగామలుచుకుని పట్టుదల,ధైర్యమే పునాదిగా ముం దుకు సాగుతున్న ఒక మహిళ జీవిత విశేషాలు..... సమా జం ఒక మనిషిని ఒకేకోణం నుండి చూడడం కాదు. కోణా ల నుండి చూడాలి అన్నది ఆమె మాటల్లోనే అనేకం. చిన్న తనంలోనే 12సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయి నా మొక్కవోని పట్టుదలతో ఆత్మస్థైర్యంతో పేదరికాన్ని సా కుగా తీసుకోకుండా 10వ తరగతిలో బాలికల రెసిడెన్షి యల్ స్కూల్ హసన్‌పర్తి నుండి రాష్ట్రస్థాయిలో ఏడవ ర్యాంకును సాధించిన ఘనత ఆమెది. కుటుంబ నేపథ్యం దృష్ట్యా 17 ఏళ్ల చిన్న వయసులో వివాహం జరిగినప్పటికీ వివాహం మహిళ అభివృద్ధికి ఆటంకం కానే కాదని నిరూ పిస్తూ, డిగ్రీ బిఈడి పూర్తి చేసుకుని 1998 డిఎస్సీ ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్‌గా నియామకమై,వేలేరు మండలం వేలేరులో దాదాపు పదేళ్లుఉపాధ్యాయురాలుగా ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి, 2007 గ్రూప్ 2 ద్వారా డి ప్యూటీ తహశీల్దారుగా ఏపీపీఎస్సీ నియమితురాలై ప్రస్తు తం ధర్మసాగర్ తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న మర్కాల రజిని తహశీల్దార్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.
నవ తెలంగాణ రిపోర్టర్ : వివాహం మహిళలకు అడ్డంకి కాదని మీరు భావిస్తున్నారా?
తహశీల్దార్ : అవును మహిళా ప్రగతికి అన్నిరంగాల్లో దూ సుకుపోవడానికి వివాహం అడ్డు కాదు. మనలో సాధిం చాలనే తపన ఉన్నప్పుడు ఎటువంటి ఆటంకాలు వచ్చిన మనల్ని ఎవరు ఆపలేరు.
నవతెలంగాణ రిపోర్టర్ : మహిళలను ప్రస్తుతం సమాజం చిన్న చూపు చూస్తుందని భావిస్తున్నారా?
తహశీల్దార్ : కాదు సమాజం అంటేనే రకరకాల మనస్త త్వాలు ఉన్న విభిన్న వ్యక్తుల కలయిక, కొంతమంది వ్యక్తుల నుబట్టి మనం సమాజాన్ని మొత్తం తప్పు పట్టలేము. అయి నప్పటికీ పురుషులతో సమానంగా అన్నిరంగాలలో స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వరు అనేది నిర్వివాదాంశం. అలాగే ప్రతి వి షయంలో లింగవివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడవారిని చిన్నచూపు చూడడం కుటుంబం నుండి మొదలవుతుంది. కుటుంబ స్థాయిలో చిన్నప్పటినుండి పిల్లలకు ఆడామగా తేడా కనపడనీయకుండా పెంచితే కొంతమంది వరకు ఈ లింగవివక్ష రూపుమాపవచ్చు. ఇప్పటికీ ఏ స్థాయిలో ఉన్న ప్పటికీ ఆడవాళ్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెనుక డుగువేస్తూనే ఉంటారు. కారణం చెప్పిన ముందుగా తప్పు పట్టేది ఆడవారినేకాబట్టి. అంతేగాక ఒక మహిళ వారి కం టే ఉన్నతస్థానం చేరుతుంది అంటే,తన సొంతశక్తితో కూ డా చాలామందిని మగవాళ్ళకిందకు పడవేయడానికి ప్రయ త్నిస్తారు.ఎన్ని మాటలు చెప్పినా ముందుగా ప్రతి వ్యక్తి మా నసిక ఆలోచనల్లో మార్పు వస్తేనే సమాజంలో మహిళలు ముందుంటారు. మహిళలుకూడా ధైర్యంగా అన్ని సవాళ్లకు ఎదుర్కొంటు ముందుకు పోవాలి.ప్రతి విషయంలో భావో ద్వేగాలకు గురికాకుండా, మానసికంగా బలంగా తయారు కావాలి. ఒక మహిళ సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొ నగలిగితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. అలాం టి కొన్ని కుటుంబాలు కలిస్తేనే సమాజం అవుతుంది. కాబట్టి ప్రతి మహిళ తనలోని శక్తియుక్తులను 100శాతం ఉపయోగించుకోవాలి.
నవతెలంగాణ రిపోర్టర్ : మీరు మహిళగా ఎలాంటి సమ స్యలు ఎదుర్కొంటున్నారు ?
తహశీల్దార్ : మహిళలు కుటుంబంలో ఆయన సమాజం లోని ఏస్థానంలో అయినా సమర్థవంతంగా విధులు నిర్వ హించగలరు. పురుషులతో పోలిస్తే పని నాణ్యత కష్టపడే తత్వం స్త్రీలలో ఎక్కువ అయినప్పటికీ ఒక మహిళ అధి కారిగా కొన్ని సమస్యలు ఎదుర్కొనడం సహజం. ఒకే పని ని మగవాళ్లు చేస్తే ఒకలాగా మహిళలు చేస్తే మరోలాగా భావించే వ్యక్తుల మనస్తత్వాలతో తేడా రానంతవరకు మహిళలకు సమస్యలు తప్పవు. మహిళలు కూడా తాము తక్కువఅనే భావన మనసులో నుండి తీసివేసి ఆత్మస్థై ర్యంతో ముందుకు పోవాలి.
నవతెలంగాణ రిపోర్టర్ : చట్టసభల్లో రాజకీయాల్లో మహి ళల ప్రాతినిథ్యంపై మీ అభిప్రాయం ?
తహశీల్దార్ : మహిళలకు ఏ పని అప్పగించిన సమర్థవం తంగా పూర్తి చేయగలరు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక పు రుషుని భార్యగాను తోబుట్టులాగను తప్ప తన సొంత రాజ కీయాలలో పాల్గొని ఎదిగినమహిళల సంఖ్య చాలా తక్కువ అలా కాకుండా మహిళలకు కూడా రాజకీయ పార్టీలు ప్రోత్సహించాలి మహిళలను ప్రోత్సహిస్తే పురుషుల కంటే సమర్థవంతంగా విధులు నిర్వహించగలరు.
నవ తెలంగాణ రిపోర్టర్ : మీ కుటుంబం గురించి ?
తహశీల్దార్ : నాకు ఇద్దరు పిల్లలు నా కుమారుడు రాహుల్ రెడ్డి, అమెరికాలో ఎమ్మెస్ పూర్తి అయ్యి హెచ్‌ఐబి వీసాతో డెల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నా కుమార్తె వర్షా రెడ్డి చలిమేడ మెడికల్ కాలేజ్ కరీంనగర్లో ఎంబిబిఎస్ హౌస్ సర్జన్ చేస్తుంది. మావారు ప్రత్యేక ఫార్మసీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
నవ తెలంగాణ రిపోర్టర్ : రెవెన్యూ డిపార్ట్మెంట్లో మహిళల ప్రాధాన్యం ఎలా ఉంది.
తహశీల్దార్ : రెవెన్యూ డిపార్ట్మెంట్లో మహిళలకు తగిన ప్రాధాన్యత ఉంది మన జిల్లా హనంకొండ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ మహిళామణులే. అదేవిధంగా మూడు మండలాల తహశీల్దారులుగా కలెక్టర్ గారి కార్యాల యం ముందు సూపరిండెంట్ గా మహిళలు విధులు సమర్ధవం తంగా నిర్వర్తిస్తున్నారు. మా డిపార్ట్మెంట్లు మహిళల పట్ల ఎటువంటి వివక్ష లేదు. రెవెన్యూ యూనియన్ లో కూడా మహిళకు తగిన ప్రాధాన్యత ఉంది.
నవతెలంగాణరిపోర్టర్ : మహిళలకు మీరిచ్చే సందేశం.
తహశీల్దార్ : ప్రతి మహిళ తనను తాను తక్కువ అనుకో కుండా తనలోని శక్తి సామర్థ్యాలను గురించి క్రమశిక్షణ పట్టుదలతో ముందుకుసాగాలి. తాను కరుగుతూ లోకానికి వెలుగునిచ్చే క్రోవర్తి లాగా కాకుండా తాను వెలుగుతూ తనచుట్టూ వెలుగులు పంచే దీపం లాగా ఇతర మహి ళలకు కూడా చేయూతనివ్వాలి.