Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జెడ్పీ వైస్ చైెర్పర్సన్ బడే నాగజ్యోతి
నవతెలంగాణ -తాడ్వాయి
సమాజంలో మహిళల పాత్ర కీలకమని ములుగు జిల్లా జెడ్పీ వైస్ చెర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నాగజ్యోతిని నవ తెలంగాణ ముఖాముఖి పలకరించింది. వివరాలు ఆమె మాటల్లోనే..
మహిళా ప్రజాప్రతినిధిగా రావడానికి మీ కృషి ? ఎదుర్కొన్న సమస్యలు ?
నాగజ్యోతి : పేద ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న కుటుంబం మాది. మా నాన్న బడే ప్రభాకర్ అన్న పేద ప్రజల కోసం అప్పటి పీపుల్స్ (ప్రస్తుతం మావోయిస్టు) పార్టీలో చేరి, పేద ప్రజల కోసం ఎన్కౌంటర్ అయ్యాడు. చిన్నతనం నుండే నేను పేద ప్రజలకు సేవ చేయాలనే భావంతో రాజకీయంలోకి వచ్చాను. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఐటీశాఖ మంత్రి తారక రామారావు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం మాది కాబట్టి నాకు తాడ్వాయి మండల జెడ్పీటీసీగా టిక్కెట్ ఇచ్చి నన్ను జిల్లా వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటినుండి నిరంతరం పేద ప్రజలకు సేవ చేస్తున్నాను.
పేదలు, మహిళలల అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి ?
నేను సుమారు 2019 సంవత్సరం కాల్వపల్లి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అదే సంవత్సరం అత్యధిక మెజార్టీతో జడ్పిటిసి గా ఎన్నికై, జడ్పీ వైస్ చైర్మన్ గా ఎన్నికైనప్పటినుండి పేద ప్రజల కోసం ఏజెన్సీలో కషి చేస్తున్నాను. ప్రత్యేకంగా మహిళల కోసం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను మహిళా లోకానికి అందే విధంగా కషి చేశాను. బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లతో పాటు మహిళలకు ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు, రాజకీయంలో ప్రత్యేక రిజర్వేషన్లు, విద్య, వైద్య, రంగాల్లో మహిళలకు పెద్దపీట వేసింది. ములుగు ఏజెన్సీలో ప్రతి అర్హత గల మహిళకు సంక్షేమ పథకాలు, అభివద్ధి పొలాలు అదేవిధంగా నిరంతరం కషి చేశాను.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మీ స్పందన?
నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా వ్యాప్తంగా అలాంటి సమస్య జరగలేదు. మా ఏజెన్సీలో పోలీస్ శాఖ, మహిళా, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు పగడ్బందీగా విధులు నిర్వహిస్తున్నాయి. మహిళలకు పూర్తి రక్షణ ఉంది. ఇప్పటివరకు మహిళలకు అలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు.
రాబోయే ఎన్నికల్లో మీరు
ఎమ్మెల్యే బరిలో పోటీలో ఉన్నారా ?
మా కుటుంబం గతం నుండి ఉద్యమ నేపథ్యం గల పేద ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న కుటుంబం కాబట్టి, దాన్ని గుర్తించి సర్పంచ్ గా ఎన్నికైన నన్ను తాడ్వాయి జెడ్పిటిసిగా టిక్కెట్ ఇచ్చి గెలిపించి, ములుగు జడ్పీ వైస్ చైర్మన్ గా చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ములుగు ఇన్చార్జి మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, మిగతా బిఆర్ఎస్ పెద్దల ఆశీస్సులు మేరకు, వారి అనుమతి ప్రకారం నాకు అవకాశం ఇస్తే ప్రజాసేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను బిఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్న. పెద్దలు అధిష్టానం ఏ విధంగా చేస్తే ఆ విధంగా కట్టుబడి ఉంటా..
చివరిగా మహిళా లోకానికి మీరిచ్చే సందేశం ?
మహిళలు లేకపోతే దేశ అభివద్ధి ఉండదు. సమాజాభివద్ధిలో మహిళ పాత్ర నిర్వచనీయం, ఇది గుర్తించిన బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా నేడు మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా మహిళలకు, మహిళ మణులకు 'ఆరోగ్య మహిళ' పేరిట ఎనిమిది రకాల అనారోగ్య సమస్యలకు ఉచిత వైద్యం కార్యక్రమం ప్రారంభించారు. మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటిని సద్వినియోగం చేసుకొని విద్యా, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.