Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ తహసీల్ధార్ జరుపుల మమత
నవతెలంగాణ-గోవిందరావుపేట
మారుతున్న కాలానికి అనుగుణంగా అభివద్ధి చెందుతున్న టెక్నాలజీ సహాయంగా మహిళ సాధికారతే లక్ష్యంగా మహిళలంతా తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని గోవిందరావుపేట మండలం డిప్యూటీ తహసీల్ధార్ జర్పుల మమత అన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం డిప్యూటీ తాసిల్దార్ మమత నవ తెలంగాణతో మాట్లాడారు. సమాజంలో ప్రతి మహిళ ఒక గహిణి మాత్రమే అనే పదానికి తావు లేకుండా సమాజంలో అందరూ సమానమే అని విధంగా ప్రతి రంగంలోనూ మహిళలు ప్రథమ స్థానంలో రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా సమాజంలో సామాజిక ఆర్థిక మానసిక బలహీనతలను అధిగమిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని పోటీతత్వం పెంచుకొని నిరూపించుకొని అబల కాదు సబల అని సమాజం చెప్పుకునే విధంగా ఉండాలన్నారు. రాజ్యాంగ హక్కులను పాలక ప్రభుత్వాలు పక్కాగా అమలుపరిచేలా అన్యాయం జరిగిన ప్రతి ప్రాంతంలో సంఘటితంగా ఎదుర్కొనాలని సూచించారు. విద్యాపరంగా పట్టణాలు మారుమూల ప్రాంతాలు అనే తేడా లేకుండా ఇప్పుడున్న టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని సమస్తాయిలో ఫలితాలను సాధించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మహిళలకు ఆర్థికంగా రాజకీయంగా ఇతర రంగాలలో కూడా రిజర్వేషన్ పరంగా రావలసిన వాటాలను ఇవ్వకుండా కాలయాపన చేయడం సమంజసం కాదు అన్నారు. రాజ్యాంగ హక్కుల ప్రకారం రాజకీయంగా ఆర్థికంగా న్యాయపరంగా ప్రకటించిన అన్ని రంగాల్లోనూ సమానత్వం కల్పించాలని అన్నారు. విద్యాలయాల్లో కానీ కాలేజీల్లో కానీ ఉద్యోగాలు చేసే ప్రాంతంలో కానీ మహిళలకు సరైన భద్రత లభించకపోవడం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణమని మహిళ చట్టాలను సక్రమంగా అమలుపరచినట్లయితే మహిళలకు అన్నింట భద్రత ఉంటుందని అన్నారు. మహిళల మాన ప్రాణ తదితర భద్రత కోసం చట్టాలను మరింత కట్టుదిట్టంగా అమలు పరచాలని అన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు సోదర భావాన్ని అలవర్చే విధంగా నైతిక విలువలపై శిక్షణ నేర్పించి ఇవ్వాలన్నారు. డాక్టర్ ప్రీతి విషయం చాలా బాధాకరమని, మరో సంఘటనకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఇలాంటి సంఘటన పట్ల మానసికంగా ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని ఇలాంటి సంఘటనలను ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండాలని అన్నారు. బాలికల స్థాయి నుండి ఆత్మ రక్షణ కోసం కరాటే వంటి విద్యలను బాలికలకు కూడా పూర్తిస్థాయిలో నేర్పించినట్లయితే వారి ఆత్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచి స్థాయి నుండి మొదలుకొని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలను అధికారులను ప్రజాప్రతినిధులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఇప్పుడు మన భారత ప్రభుత్వం రక్షణ రంగంలో కూడా అన్ని స్థానాల్లో మహిళలను వారి సామర్థ్యాన్ని బట్టి భర్తీ చేస్తూ మహిళలు సమానమైన అంటూ సంకేతాలు పంపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లోనూ ఉన్నటువంటి అన్ని రకాల అవకాశాలను పునికి పుచ్చుకొని దీటుగా ముందుండాలని మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.